ఈ మధ్యకాలంలో సింగర్ మంగ్లీ భారీ పాపులారిటీ సంపాదించుకుంది. ఆమె పాడుతోన్న పాటలన్నీ కూడా నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. కొన్ని సార్లు ఆమె పాడిన పాటలు వివాదాలకు కూడా దారి తీశాయి. మొదట తీన్ మార్ వార్తలతో గుర్తింపు తెచ్చుకున్న మంగ్లీ ఆ తరువాత ప్రయివేట్ సాంగ్స్ ద్వారా మరింత క్రేజ్ ను సంపాదించుకుంది. ఆమెలో సింగర్ ని గుర్తించిన మ్యూజిక్ డైరెక్టర్ తమన్ 'శైలజారెడ్డి అల్లుడు' సినిమాలో పాట పాడే ఛాన్స్ ఇచ్చాడు. 


ఆ తరువాత మంగ్లీ కెరీర్ పరంగా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఆమె ఎలాంటి పాట పాడినా కూడా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతోంది. దీంతో ఆమెకి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా బాగానే పెరిగింది. గతంలో కంటే మంగ్లీకి జనాల్లో క్రేజ్ పెరిగింది. ఆమె ఈవెంట్స్ కి ఎగబడి వస్తున్నాయి. రీసెంట్ గా ఓ ప్రయివేట్ సాంగ్ షూటింగ్ కోసం వెళ్లిన మంగ్లీ అక్కడ అభిమానులపై ఒక్కసారికి మండిపడింది. 


సెల్ఫీలు తీసుకోవడానికి ఎగబడ్డ అభిమానులపై ఆగ్రహంతో ఊగిపోయింది మంగ్లీ. ఫోన్లు పగలగొట్టండి అంటూ తిట్టేసింది. ఆఖరికి తన అసిస్టెంట్ పై కూడా మంగ్లీ కోపగించుకుంది. వెంటనే బండికి ఫోన్ చెయ్ రా దరిద్రుడా.. అంటూ ఫైర్ అయింది. ఏదేమైనా మంగ్లీ తన సహనాన్ని కోల్పోయి ఇలా చిర్రెత్తిపోవడంపై సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ వస్తున్నాయి. 


మంగ్లీ ప్రైవసీకి భంగం కలిగించే విధంగా అక్కడ వాతావరం ఉండడం వలనే ఆమె కోపగించుకున్నట్లు కూడా అనిపిస్తోంది. ప్రస్తుతం మంగ్లీ ఫైర్ అయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి ఈ విషయంలో ఆమె క్లారిటీ ఇస్తుందేమో చూడాలి. రీసెంట్ గానే మంగ్లీ సోదరి ఇంద్రావతి చౌహాన్ 'పుష్ప' సినిమాలో ఐటెం సాంగ్ పాడి ఇండస్ట్రీకి పరిచయమైంది. ఇదే పాటను కన్నడలో మంగ్లీ పాడింది.   



Also Read: హ్యాట్రిక్ హిట్స్ తో బాక్సాఫీస్ రచ్చ..