మెగాస్టార్ చిరంజీవి కోడలు, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఓ పక్క ఇంటి బాధ్యతలను నిర్వర్తిస్తూనే.. మరోవైపు అపోలో హాస్పిటల్స్‌ చైర్‌ పర్సన్‌గా బిజీగా గడుపుతున్నారు. పలు సేవా కార్యక్రమాలను చేపడుతూ.. ఛారిటీలను నిర్వహిస్తూ.. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నారు. తాజాగా ఉపాసనకు అరుదైన గుర్తింపు లభించింది. ఎంతో ప్రసిద్ధి చెందిన దుబాయ్ గోల్డెన్ వీసాను పొందారు ఉపాసన. 

 

క్రిస్మస్ కానుకగా ఈ బహుమతి దక్కించుకున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఇటీవల జరిగిన ఇండియా ఎక్స్ పో-2020 ద్వారా ఈ ప్రపంచమంతా ఒక్కటే అని తెలుసుకున్నానని, 'వసుధైక కుటుంబం' అనే భావనకు అర్థం తెలిసిందని ఉపాసన అన్నారు. యూఏఈ గోల్డెన్‌ వీసా పొందడం సంతోషంగా ఉందని.. అన్ని దేశాల పట్ల అపారమైన గౌరవం, ప్రేమ కలిగిన భారతీయురాలిని. నేను అధికారికంగా గ్లోబల్‌ సిటిజన్ అంటూ ట్విట్టర్ లో రాసుకొచ్చింది ఉపాసన. 

 

ఇటీవల దుబాయ్ లో 2020 ఎక్స్‌పోను సందర్శించిన ఉపాసన.. అగ్‌మెంటెడ్‌ రియాలిటీ ద్వారా ప్రధాని నరేంద్రమోదీని కలిశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఉపాసన గోల్డెన్ వీసాను పొందినట్లు తెలుస్తోంది. ఇప్పటికే చాలా మంది ఇండియన్ సెలబ్రిటీలు యూఏఈ గోల్డెన్ వీసాలు అందుకున్నారు. టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా, మలయాళ నటుడు మమ్ముట్టి, మోహన్ లాల్, దుల్కర్ సల్మాన్, నటి త్రిష, గాయని చిత్ర ఇలా చాలా మంది గోల్డెన్ వీసా అందుకున్నారు. 







 



Also Read:అఖిల్ 'బీస్ట్' లుక్.. ట్రాన్స్ఫర్మేషన్ చూసి ఫ్యాన్స్ షాక్..


Also Read: పాముతో పాటేసుకుంది.. దానికి తిక్కరేగి కాటేసింది.. ప్రముఖ సింగర్‌కు చేదు అనుభవం


Also Read:తమన్ కి క్రేజీ ఛాన్స్ ఇచ్చిన ప్రభాస్.. 'రాధేశ్యామ్' బీజియమ్ అదిరిపోవాలంతే..



ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి