స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం 'పుష్ప'. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా డివైడ్ టాక్ వచ్చినా.. వసూళ్ల హవా మాత్రం అసలు తగ్గడం లేదు. ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా సత్తా చాటుతోంది. ఇప్పుడు ఈ సినిమాకి కొనసాగింపుగా పార్ట్ 2 'పుష్ప ది రూల్' రాబోతుంది. 


వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి ఈ సినిమా షూటింగ్ జరగనుందని నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ అనౌన్స్ చేసింది. ఆల్రెడీ స్క్రిప్ట్ రెడీగా ఉంది కాబట్టి సుకుమార్ ఈసారి ఎక్కువగా సమయం తీసుకోవాల్సిన అవసరం లేదు. అయినప్పటికీ బన్నీ.. దర్శకుడు సుకుమార్ కి డెడ్ లైన్ విధించినట్లు తెలుస్తోంది. వందరోజుల్లో షూటింగ్ ను పూర్తి చేయాలని చెప్పాడట బన్నీ. 


2022 దసరా నాటికి 'పుష్ప' పార్ట్ 2ని విడుదల చేయాలని భావిస్తున్నారు. అందుకే వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు మొదలుపెట్టాలని చూస్తున్నారు. నిజానికి పార్ట్ 1 సమయంలో పోస్ట్ ప్రొడక్షన్ కి ఎక్కువ సమయం దొరకలేదు. దీంతో ఆ ఎఫెక్ట్ సీజీ వర్క్ పై పడింది. సినిమాలో గ్రాఫిక్స్ సరిగ్గా లేదనే విమర్శలు వచ్చాయి. 


ఈసారి అలాంటి కామెంట్స్ కి తావివ్వకుండా త్వరగా షూటింగ్ పూర్తి చేసి.. గ్రాఫిక్స్ అండ్ మిగిలిన వర్క్ పై ఎక్కువ ఫోకస్ చేయాలని చూస్తున్నారు. బన్నీ కాల్షీట్స్ కూడా రెడీగా ఉన్నాయి. ఈ సినిమాలో విలన్ గా నటిస్తోన్న ఫహద్ ఫాజిల్ డేట్స్ కూడా బల్క్ గా కావాల్సి ఉంది. ఆయన కాల్షీట్స్ ను బట్టి 'పుష్ప' షూటింగ్ వేగం ఆధారపడి ఉంటుంది. 


సెకండ్ పార్ట్ లో కొన్ని సన్నివేశాలను రీరైట్ చేయాలనుకుంటున్నారు సుకుమార్. ఫిబ్రవరి వరకు షూటింగ్ మొదలుకాదు కాబట్టి అప్పటివరకు ఆయనకు సమయం ఉంది. 'పుష్ప ది రైజ్' కంటే 'పుష్ప ది రూల్'లో రా సన్నివేశాలు ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు. అలానే ఎమోషన్స్ కూడా ఓ రేంజ్ లో చూపించబోతున్నారట.  


Also Read:అఖిల్ 'బీస్ట్' లుక్.. ట్రాన్స్ఫర్మేషన్ చూసి ఫ్యాన్స్ షాక్..


Also Read: పాముతో పాటేసుకుంది.. దానికి తిక్కరేగి కాటేసింది.. ప్రముఖ సింగర్‌కు చేదు అనుభవం


Also Read:తమన్ కి క్రేజీ ఛాన్స్ ఇచ్చిన ప్రభాస్.. 'రాధేశ్యామ్' బీజియమ్ అదిరిపోవాలంతే..


Also Read: త్రివిక్రమ్ హోమ్ బ్యానర్ లో నవీన్.. త్వరలోనే టైటిల్ అనౌన్స్మెంట్..


Also Read: ఏపీలో థియేటర్లు క్లోజ్.. నిఖిల్ ఎమోషనల్ పోస్ట్..


Also Read:సల్మాన్ ఖాన్ కి పాముకాటు.. హాస్పిటల్ లో ట్రీట్మెంట్..


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి