Sarva Darshan Tokens: అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన చిత్తూరు జిల్లా తిరుమల క్షేత్రం శ్రీ వేంకటేశ్వర స్వామి సర్వదర్శనం టోకెన్ల వచ్చేశాయి. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ కన్నా రెండు రోజుల అనంతరం తిరుమల తిరుపతి దేవస్థానం (Tirupati Tirumala Devasthanam) ఈ టోకెన్లు విడుదల చేసింది. జనవరి నెలలో భక్తులు స్వామి వారిని దర్శించుకునేందుకు టికెట్లు విడుదల చేశారు.
వచ్చే ఏడాది జనవరి మాసానికి సంబంధించి టిక్కెట్లను tirupatibalaji.ap.gov.in టీటీడీ వెబ్ సెట్‌లో శ్రీవారి సవర్వదర్వనం టోకెన్లు విడుదల చేసారు. సర్వదర్శనం టోకెన్లను ఇలా విడుదల చేశారో లేదో.. క్షణాల్లో అన్నీ ఖాళీ అయిపోయాయి. కేవలం 10 నిమిషాల వ్యవధిలోనే సర్వదర్శనం టిక్కెట్లను భక్తులు పొందారు. కరోనా ఆంక్షలు కారణంగా టీటీడీ పరిమిత సంఖ్యలోనే భక్తులను దర్శనానికి టీటీడీ అనుమతిస్తుందని తెలిసిందే.
శ్రీవారి దర్శనం కోసం లక్షలాదిగా వేచి చూస్తున్న భక్తులకు టీటీడీ నుంచి నిరాశ మాత్రం తప్పడం లేదు. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ముప్పు పొంచి వున్న నేపథ్యంలో జనవరి మాసంలో కూడా దర్శనం కోటాను టీటీడీ పెంచలేదు. రోజుకీ కేవలం 10 వేల చొప్పున సోమవారం ఉదయం 9 గంటలకు 2లక్షల 60వేల టోకెన్లను ఆన్ లైన్లో టీటీడీ అధికారులు విడుదల చేశారు. గత నెల తరహాలోనే కేవలం 10 నిమిషాల వ్యవధిలోనే శ్రీవారి భక్తులు సర్వదర్శనం టోకెన్లు బుక్ చేసుకున్నారు.
టోకెన్లు కోటా పూర్తయిన విషయం తెలియని భక్తులు ఇంకా వేలాదిగా టోకెన్ల కోసం ప్రయత్నిస్తూ ఉన్నారు. తిరుల శ్రీవారి దర్శనం కోసం భక్తుల నుంచి నెలకొని వున్న డిమాండ్ కు ఇది నిదర్శనం. జనవరి మాసంలో వైకుంఠ ఏకాదశి పర్వదినం వస్తుండడం ఏకాదశిని పురస్కరించుకొని శ్రీవారి ఆలయంలో 10రోజుల పాటు వైకుంఠ ద్వారాలను తెరవనుండడంతో స్థానికులకు వైకుంఠ ద్వారా దర్శనం కల్పించాల్సి వుండడంతో 13వ తేదీ నుంచి 22వ తేదీ వరకు టీటీడీ నిత్యం 5వేల టోకెన్లనే విడుదల చెయ్యడంతో మిగతా టోకెన్లను ఎప్పుడు విడుదల చేస్తారో టీటీడీ ఇంకా ప్రకటించలేదు. కోటాను స్థానికులకే పరిమితం చేస్తారా లేక భక్తులందరికీ కేటాయిస్తారోనని టోకెన్లు దొరకని భక్తులు ఆశతో ఎదురుచూస్తున్నారు.
Also Read: Shanmukh: 'ఫాలో.. అన్‌ఫాలో కాదు.. నేనే గ్యాప్ ఇచ్చా..' దీప్తితో పెళ్లిపై షణ్ముఖ్ క్లారిటీ..
Also Read:టాలీవుడ్ లో యూనిటీ లేదు.. వైరల్ అవుతోన్న నాని వ్యాఖ్యలు
Also Read: Year Ender 2021: మోదీ షాకిచ్చిన 5 ప్రకటనలు..! సారీతో సంచలనం