నేచురల్ స్టార్ నాని నటించిన 'శ్యామ్ సింగరాయ్' సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటిషో నుంచే పాజిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది ఈ సినిమా. నాని, సాయిపల్లవిల పెర్ఫార్మన్స్ కి ఆడియన్స్ ఫిదా అయిపోయారు. వసూళ్లపరంగా కూడా ఈ సినిమా దూసుకుపోతుంది. ఫస్ట్ వీకెండ్ పూర్తయ్యేసరికి ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.13.50 కోట్ల కలెక్షన్స్ ను రాబట్టింది.
ఏరియాల వారీగా వసూళ్లు..
నైజాం - రూ.4.82 కోట్లు
సీడెడ్ - రూ.1.45 కోట్లు
ఉత్తరాంధ్ర - రూ.1.35 కోట్లు
గుంటూరు - రూ.0.77 కోట్లు
ఈస్ట్ - రూ.0.48 కోట్లు
వెస్ట్ - రూ.0.45 కోట్లు
కృష్ణ - రూ.0.56 కోట్లు
నెల్లూరు - రూ.0.40 కోట్లు
మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల్లో కలుపుకొని ఈ సినిమా రూ.10.28 కోట్లు రాబట్టింది. రెస్ట్ ఆఫ్ ఇండియా రూ.1.15 కోట్లు, ఓవర్సీస్ లో రూ.2.85 కోట్లు వసూళ్లు వచ్చాయి. మొత్తంగా ఈ సినిమా పదమూడు కోట్ల వరకు కలెక్షన్స్ ను వసూలు చేసింది. ఈ సినిమా బ్రేక్ ఈవెంట్ అవ్వాలంటే రూ.30 కోట్ల షేర్ ను రాబట్టాలి. అయితే ఏపీలో టికెట్ రేట్ ఇష్యూ కారణంగా ఈ సినిమా కలెక్షన్స్ పై దెబ్బ పడింది. అయినప్పటికీ.. ఈ సినిమా మంచి వసూళ్లను రాబడుతోంది.
Also Read:అఖిల్ 'బీస్ట్' లుక్.. ట్రాన్స్ఫర్మేషన్ చూసి ఫ్యాన్స్ షాక్..
Also Read: పాముతో పాటేసుకుంది.. దానికి తిక్కరేగి కాటేసింది.. ప్రముఖ సింగర్‌కు చేదు అనుభవం
Also Read:తమన్ కి క్రేజీ ఛాన్స్ ఇచ్చిన ప్రభాస్.. 'రాధేశ్యామ్' బీజియమ్ అదిరిపోవాలంతే..
Also Read: త్రివిక్రమ్ హోమ్ బ్యానర్ లో నవీన్.. త్వరలోనే టైటిల్ అనౌన్స్మెంట్..
Also Read: ఏపీలో థియేటర్లు క్లోజ్.. నిఖిల్ ఎమోషనల్ పోస్ట్..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి