అర్జున ఫల్గుణ: 

వైవిధ్యమైన కథలను ఎన్నుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు నటుడు శ్రీవిష్ణు. ఇప్పుడు ఆయన మరో విభిన్నమైన కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అదే 'అర్జున ఫల్గుణ'. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. దీనికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. 'చెడుపై మంచి ఎప్పుడూ విజయం సాధిస్తుంది' అనే లైన్ తో ఈ సినిమాను దర్శకుడు తేజ మార్ని తెరకెక్కిస్తున్నాడు. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. డిసెంబర్ 31న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

 

1945: 

హీరో రానా, రెజీనా జంటగా నటించిన చిత్రం '1945'. పీరియాడిక్ డ్రామాగా ఈ సినిమాను తెరకెక్కించారు. సత్యశివ తెరకెక్కించిన ఈ సినిమాను సి.కళ్యాణ్ నిర్మించారు. ఇందులో సత్యరాజ్, నాజర్ కీలకపాత్రలు పోషించారు. ఈ సినిమాను డిసెంబర్ 31న విడుదల చేయనున్నారు. 

 

జెర్సీ:

తెలుగులో భారీ విజయాన్ని అందుకున్న 'జెర్సీ' సినిమాను అదే పేరుతో హిందీలో తెరకెక్కిస్తున్నారు. తెలుగు వెర్షన్ ను డైరెక్ట్ చేసిన గౌతమ్ తిన్ననూరి హిందీ వెర్షన్ ను కూడా డైరెక్ట్ చేశారు. ఇందులో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని డిసెంబరు 31న ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

డిటెక్టివ్‌ సత్యభామ:

సోని అగర్వాల్‌ మెయిన్ లీడ్ లో నటించిన ఈ సినిమాను నవనీత్‌ చారి తెరకెక్కించారు. ఈ సినిమా ఈనెల 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

 

అంతఃపురం: 

తమిళంలో 'అరణ్మణై 3' పేరుతో తెరకెక్కిన ఈ సినిమాను తెలుగులో 'అంతఃపురం' పేరుతో విడుదల చేయనున్నారు. ఇందులో ఆర్య, రాశి ఖన్నా, ఆండ్రియా, సి.సుందర్‌ ముఖ్యపాత్రలు పోషించారు. డిసెంబర్ 31న ఈ సినిమా విడుదల కానుంది. 

 

ఇందువదన:

వరుణ్ సందేశ్, ఫర్నాజ్‌ శెట్టి జంటగా నటించిన చిత్రం 'ఇందువదన'. శ్రీనివాసరాజు డైరెక్ట్ చేసిన ఈ సినిమా న్యూఇయర్ కానుకగా జనవరి 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

 

ఆశా ఎన్‌కౌంటర్‌:

హైదరాబాద్ లో జరిగిన గ్యాంగ్‌రేప్‌ ఆధారంగా తెరకెక్కిన సినిమా 'ఆశా ఎన్‌కౌంటర్‌'.  ఆనంద్‌ చంద్ర డైరెక్ట్ చేసిన ఈ సినిమాను జనవరి 1న విడుదల చేయనున్నారు. 

ఆర్జీవీ సమర్పణలో అనురాగ్‌ కంచర్ల ఈ చిత్రాన్ని నిర్మించారు.



ఓటీటీ రిలీజ్ లు.. 

 

సేనాపతి:

ప్రముఖ సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'సేనాపతి'. పవన్ సాధినేని డైరెక్ట్ చేసిన ఈ సినిమా 'ఆహా'లో డిసెంబర్ 31న స్ట్రీమింగ్ కానుంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.