Allu Arjun: 'నువ్ లేకపోతే నేను లేను..' బన్నీ మాటలకు కన్నీళ్లు పెట్టుకున్న సుకుమార్..  

'పుష్ప' సినిమా థాంక్స్ మీట్ లో అల్లు అర్జున్ ఇచ్చిన స్పీచ్ అభిమానులను ఆకట్టుకుంది. సుకుమార్ అయితే బన్నీ మాటలకు ఎమోషనల్ అయి కన్నీళ్లు పెట్టుకున్నారు.   

Continues below advertisement

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన 'పుష్ప' సినిమా ఇటీవల విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. పాన్ ఇండియా లెవెల్ లో విడుదలైన ఈ సినిమాకి అన్ని రాష్ట్రాల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. కలెక్షన్స్ పరంగా కూడా ఈ సినిమా దూసుకుపోతుంది. తాజాగా ఈ సినిమా థాంక్స్ మీట్ ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ ఇచ్చిన స్పీచ్ అభిమానులను ఆకట్టుకుంది. సుకుమార్ అయితే బన్నీ మాటలకు ఎమోషనల్ అయి కన్నీళ్లు పెట్టుకున్నారు. 

Continues below advertisement

ముందుగా సినిమాకి పని చేసిన ప్రతి ఒక్కరినీ ప్రత్యేకంగా అభినందించారు బన్నీ. అసలు 'పుష్ప' సినిమా ఎలా మొదలైందో వీడియోల ద్వారా చెప్పారు. ఒక్కో టెక్నీషియన్స్ ను బన్నీ అప్రిషియేట్ చేయడం ఈవెంట్ కి హైలైట్ గా నిలిచింది. ఇక తన దర్శకుడు సుకుమార్ గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు బన్నీ. 

ఆయన మాట్లాడుతూ.. ''పర్సనల్ విషయాలను పబ్లిక్ గా షేర్ చేయలేం. సుకుమార్ నాకు అంత పెర్సనల్. కానీ సుకుమార్ గారేంటో ప్రపంచానికి తెలియాలి. నా లైఫ్ సుకుమార్ గారు లేకపోతే వేరేలా ఉండేది.. ఎక్కువచేసి ఏం చెప్పడం లేదు. నా కెరీర్ ఐకాన్ స్టార్ వరకు వెళ్లిందంటే దానికి కారణం సుకుమార్ గారే. నేను నా లైఫ్ లో రుణపడి ఉన్నాననే మాట చాలా కొంతమందికే వాడగలను. మా తల్లిదండ్రులకు, తాతయ్యకు వాడతాను. ఎందుకంటే మా తాతయ్య ఒక రైతు.. ఆయన సినిమాల్లోకి రావాలని డిసైడ్ అవ్వకపోతే మేమంతా ఈరోజు ఇక్కడ ఉండేవాళ్లం కాదు. నా ఫస్ట్ సినిమా నుంచి నన్ను సపోర్ట్ చేస్తున్న చిరంజీవి గారికి కూడా రుణపడి ఉంటాను. ఆ తరువాత సుకుమార్ గారికే. నేను 'పరుగు' సినిమా చేస్తోన్న సమయంలో ఒక కాస్ట్లీ కారు కొనుక్కున్నాను. దాని వాల్యూ రూ.85 లక్షలు. స్పోర్ట్స్ కార్ అదిరిపోద్ది అంతే. దాని స్టీరింగ్ మీద చేయి వేసి.. నేను ఇంత దూరం రావడానికి కారణం ఎవరని ఆలోచించగానే ముందుగా గుర్తొచ్చింది సుకుమార్ గారే. డార్లింగ్ నువ్ లేకపోతే నేను లేను'' అంటూ ఎమోషనల్ గా చెప్పారు అల్లు అర్జున్. వెంటనే సుకుమార్ కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. 'నన్ను స్టార్ ని చేసి స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ వరకు యావత్ భారతదేశం చూసేలా చేశావ్.. నీ కాంట్రిబ్యూషన్ ఎంతో నేను మాటల్లో చెప్పలేను' అంటూ సుకుమార్ గురించి గొప్పగా మాట్లాడారు బన్నీ.  

Also Read: 'ఇందువదన' ట్రైలర్.. ఇదొక హారర్ లవ్ స్టోరీ..

Also Read:2021 హయ్యెస్ట్ గ్రాసర్ 'పుష్ప'.. 'ఆర్ఆర్ఆర్' గనుక రాకపోతే.. నిర్మాత వ్యాఖ్యలు

Also Read: మెగాహీరోపై ఛార్జ్‌షీట్‌.. తేజ్ ని వదలని యాక్సిడెంట్ కేసు..

Also Read:సెల్ఫీ కోసం ఎగబడ్డ ఫ్యాన్స్.. ఫోన్లు పగలగొట్టండి అంటూ మంగ్లీ ఫైర్..

Also Read: హ్యాట్రిక్ హిట్స్ తో బాక్సాఫీస్ రచ్చ..

 
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి
Continues below advertisement