స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం 'పుష్ప'. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా డివైడ్ టాక్ వచ్చినా.. వసూళ్ల హవా మాత్రం అసలు తగ్గడం లేదు. ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా సత్తా చాటుతోంది. ఇప్పుడు ఈ సినిమాకి కొనసాగింపుగా పార్ట్ 2 'పుష్ప ది రూల్' రాబోతుంది. తాజాగా ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ ను హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ ఈవెంట్ లో చిత్ర నిర్మాత నవీన్ ఎర్నేని సినిమా కలెక్షన్స్ గురించి మాట్లాడారు.
ఇప్పటివరకు ఈ సినిమా రూ.275 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసిందని.. టోటల్ రన్ లో రూ.325 నుంచి 350 కోట్ల గ్రాస్ 'పుష్ప' కలెక్ట్ చేసే ఛాన్స్ ఉందని అన్నారు. జనవరి 7న 'ఆర్ఆర్ఆర్' వస్తోందని.. లేదంటే పండగ వరకు 'పుష్ప' ఉంటే ఇంకా ఎక్కువ కలెక్షన్స్ వస్తాయని అన్నారు. హయ్యెస్ట్ గ్రాసర్ ఆఫ్ 2021 గా 'పుష్ప' నిలిచిందని చెప్పారు. తమ బ్యానర్ ని పాన్ ఇండియా బ్యానర్ చేసినందుకు సుకుమార్, బన్నీలకు థాంక్స్ అంటూ చెప్పుకొచ్చారు.
పార్టీ లేదా పుష్ప..?
'పుష్ప' సినిమా ట్రైలర్ వచ్చినప్పటి నుంచి ఈ డైలాగ్ బాగా పాపులర్ అయింది. 'ప్రతి ఒక్కరూ 'పార్టీ లేదా పుష్ప..?' అంటూ క్వశ్చన్ చేస్తున్నారు. దీనికి సమాధానమిచ్చారు అల్లు అర్జున్. 'పుష్ప' టీమ్ తో కలిసి పార్టీ చేసుకొని దానికి సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో షేర్ చేస్తూ .. 'Answer to PARTY LEDHA PUSHPA ?!' అంటూ క్యాప్షన్ ఇచ్చారు.
Also Read: మెగాహీరోపై ఛార్జ్‌షీట్.. తేజ్ ని వదలని యాక్సిడెంట్ కేసు..
Also Read:సెల్ఫీ కోసం ఎగబడ్డ ఫ్యాన్స్.. ఫోన్లు పగలగొట్టండి అంటూ మంగ్లీ ఫైర్..
Also Read: హ్యాట్రిక్ హిట్స్ తో బాక్సాఫీస్ రచ్చ..