వరుణ్ సందేశ్, ఫర్నాజ్‌ శెట్టి జంటగా నటించిన చిత్రం 'ఇందువదన'. శ్రీనివాసరాజు డైరెక్ట్ చేసిన ఈ సినిమాను మాధవి ఆదుర్తి నిర్మిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా కొత్త ఏడాదిలో జనవరి 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. లవ్‌, థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్ తో ఈ ట్రైలర్ సాగింది. హారర్ ఎలిమెంట్స్ ను కూడా జోడించారు. 


'అన్నయ్యా.. ఆత్మ, మనిషి కలిసి ఉండగలవా..?' అనే డైలాగ్ తో ట్రైలర్ మొదలైంది. ట్రైబల్ యువతితో హీరో ప్రేమలో పడడం.. ఆ తరువాత హీరోయిన్ దెయ్యంగా మారి, ఊర్లో వాళ్లను చంపుతూ ఉండడం వంటి సన్నివేశాలను ట్రైలర్ లో చూపించారు. హీరోయిన్ కి పట్టిన దెయ్యాన్ని వదిలించడానికి హీరో ఫ్రెండ్స్ చేసే ప్రయత్నాలు నవ్విస్తాయి. ట్రైలర్ లో లిప్ లాక్స్ సీన్స్ ను కూడా చూపించారు.


హీరోయిన్ ఎందుకు దెయ్యంగా మారింది..? ఆమె ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంది..? తను ప్రేమించిన వాడిని దక్కించుకుంటుందా..? అనే అంశాలు సినిమా చూసిన తెలుసుకోవాల్సిందే. ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, మాటలు సతీష్ ఆకేటీ అందిస్తుండగా.. శివ కాకాని సంగీతం సమకూరుస్తున్నారు. రఘుబాబు, అలీ, నాగినీడు, ధనరాజ్ లాంటి నటులు కీలకపాత్రలు పోషించారు.  



ఇక వరుణ్ సందేశ్ విషయానికొస్తే.. 'హ్యాపీడేస్', 'కొత్త బంగారు లోకం' వంటి సినిమాలతో భారీ విజయాలను అందుకున్న ఈ హీరో.. వచ్చిన సక్సెస్ ను నిలబెట్టుకోలేకపోయాడు. వరుస పరాజయాలు పలకరించడంతో అతడి కెరీర్ ఇబ్బందుల్లో పడింది. అదే సమయంలో బిగ్ బాస్ షోలో ఆఫర్ వచ్చింది. ఇందులో తన గేమ్ తో అందరినీ ఆకట్టుకున్నాడు. బిగ్ బాస్ తరువాత 'ఇందువదన' సినిమాలో ఆఫర్ దక్కించుకున్నాడు. మరి ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ అందుకుంటాడో చూడాలి!


Also Read:2021 హయ్యెస్ట్ గ్రాసర్ 'పుష్ప'.. 'ఆర్ఆర్ఆర్' గనుక రాకపోతే.. నిర్మాత వ్యాఖ్యలు


Also Read: మెగాహీరోపై ఛార్జ్‌షీట్‌.. తేజ్ ని వదలని యాక్సిడెంట్ కేసు..


Also Read:సెల్ఫీ కోసం ఎగబడ్డ ఫ్యాన్స్.. ఫోన్లు పగలగొట్టండి అంటూ మంగ్లీ ఫైర్..


Also Read: హ్యాట్రిక్ హిట్స్ తో బాక్సాఫీస్ రచ్చ..




 


 

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి