ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితులను బట్టి 'ఆర్ఆర్ఆర్' సినిమా వాయిదా పడే ఛాన్స్ ఉందంటూ వార్తలు వస్తున్నాయి. కానీ రాజమౌళి మాత్రం ఈ విషయంలో వెనుకడుగు వేయడం లేదు. జోరుగా సినిమాను ప్రమోట్ చేస్తూ.. చెప్పినట్లుగానే జనవరి 7న సినిమాను విడుదల చేయబోతున్నారు. కొన్ని రాష్ట్రాల్లో విధించిన కర్ఫ్యూ కారణంగా ఈ సినిమా కలెక్షన్స్ పై ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంది కానీ 'ఆర్ఆర్ఆర్' మేకర్స్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. 


ఇక ఏపీలో సినిమాలకు కష్టకాలం నడుస్తోంది. సినిమా టికెట్ రేట్లను తగ్గిస్తూ ఇటీవల జీవో జారీ చేయడంతో బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు బాగా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికే ఏపీలో చాలా థియేటర్లను యజమానులు స్వచ్ఛదంగా మూసేస్తే.. మరికొన్ని థియేటర్లను నిబంధనలు పాటించడం లేదంటూ అధికారులు సీజ్ చేశారు. ఇలాంటి సమయంలో 'ఆర్ఆర్ఆర్' మేకర్లు థియేట్రికల్ డీల్ లో ముప్పై శాతం కట్ చేసుకోవడానికి రెడీ అయ్యారు. 


కానీ బయ్యర్లు మాత్రం యాభై శాతం కట్ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ముందుగా డీల్ చేసుకున్న మొత్తంలో యాభై శాతం తగ్గించడమంటే 'ఆర్ఆర్ఆర్' నిర్మాతకు పెద్దగా కలిసొచ్చేదేమీ ఉండదు. దీంతో ఈ విషయంలో బయ్యర్లతో చర్చలు జరుగుతున్నాయి. మరి నిర్మాత ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. మిగిలిన ఏరియాల్లో మాత్రం ఇలాంటి ఇబ్బందులు లేవని సమాచారం. 


ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలు పోషిస్తోన్న ఈ సినిమాలో అలియా భట్‌, ఓలివియా మోరిస్‌ హీరోయిన్లుగా కనిపించనున్నారు. శ్రియా శరన్, అజయ్‌దేవ్‌గణ్‌ తదితరులు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి నాలుగు పాటలను విడుదల చేశారు.అందులో 'నాటు నాటు' పాటలో హీరోలు ఇద్దరు వేసిన స్టెప్పులకు సూపర్బ్ రెస్పాన్స్ లభించింది. 'జనని...' సాంగ్ సినిమాలో ఎమోషన్ ఎలివేట్ చేసింది. రీసెంట్ గా విడుదలైన 'కొమురం భీముడో' సాంగ్ రికార్డులు సృష్టిస్తోంది. ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించిన ఈ సినిమాకు డీవీవీ దానయ్య నిర్మాత.




Also Read: 'ఇందువదన' ట్రైలర్.. ఇదొక హారర్ లవ్ స్టోరీ..


Also Read:2021 హయ్యెస్ట్ గ్రాసర్ 'పుష్ప'.. 'ఆర్ఆర్ఆర్' గనుక రాకపోతే.. నిర్మాత వ్యాఖ్యలు


Also Read: మెగాహీరోపై ఛార్జ్‌షీట్‌.. తేజ్ ని వదలని యాక్సిడెంట్ కేసు..


Also Read:సెల్ఫీ కోసం ఎగబడ్డ ఫ్యాన్స్.. ఫోన్లు పగలగొట్టండి అంటూ మంగ్లీ ఫైర్..


Also Read: హ్యాట్రిక్ హిట్స్ తో బాక్సాఫీస్ రచ్చ..


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి