ఆధ్యాత్మిక గురువు కాళీచరణ్​ మహరాజ్‌ను ఛత్తీస్​గఢ్​ పోలీసులు ఈరోజు అరెస్ట్ చేశారు. మహాత్మా గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో మధ్యప్రదేశ్ వెళ్లి ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు.






పక్కా సమాచారం..







మధ్యప్రదేశ్ ఖజురహో నగరానికి 25 కిలోమీటర్ల దూరంలోని బగేశ్వర్​ ధామ్​లో కాళీచరణ్​ మహరాజ్​ ఉన్నట్లు రాయ్​పుర్​ పోలీసులకు సమాచారం అందింది. గురువారం తెల్లవారు జామున 4 గంటలకు కాళీచరణ‌్ మహరాజ్‌ను అదుపులోకి తీసుకున్నట్లు రాయ్​పుర్​ ఎస్పీ ప్రశాంత్​ అగర్వాల్​ తెలిపారు. గురువారం సాయంత్రానికి రోడ్డు మార్గంలో రాయ్​పుర్​కు తరలిస్తామని చెప్పారు. 


వివాదాస్పద వ్యాఖ్యలు..


రాయ్​పుర్​లో నిర్వహించిన రెండు రోజుల ధరణ్​ సన్సద్​ కార్యక్రమం ముగింపు కార్యక్రమంలో మహాత్మా గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేశారు కాళీచరణ్​ మహరాజ్​. మతాన్ని కాపాడుకునేందుకు హిందూ నేతను ప్రభుత్వాధినేతగా ఎన్నుకోవాలని ప్రజలను కోరారు. గాంధీజీని దూషిస్తున్నందుకు తనకు ఎలాంటి పశ్చాత్తాపం లేదన్నారు. ఈ వ్యాఖ్యలపై రాయ్​పూర్​ పోలీసులు ఐపీసీ 505(2), 294 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.


Also Read: Covid 19 Cases in India: దేశంలో భారీగా పెరిగిన కరోనా వ్యాప్తి.. 1000కి చేరువైన ఒమిక్రాన్ కేసులు


Also Read: Gold-Silver Price: పసిడి ప్రియులకు శుభవార్త! పడిపోయిన బంగారం ధర.. వెండి స్థిరంగా.. నేటి రేట్లు ఇవీ..


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌  చేయండి.