‘బిగ్ బాస్’ సీజన్ 5లో కంటెస్టెంట్లు హగ్ చేసుకుంటే.. కొందరు కుళ్లుకుంటే, మరికొందరు మాత్రం చికాకుపడ్డారు. అయితే, హగ్ అనేది కేవలం లైఫ్ పార్టనర్స్, లవర్స్ మాత్రమే ఇచ్చుకొనేది కాదు. స్నేహితులకు, సోదరి, సోదరులకు, తల్లిదండ్రులకు కూడా ఇవ్వొచ్చు. ముఖ్యంగా ‘హగ్’ అనేది బూతు కాదు. మనసులో బాధను తొలగించే ఔషదం. హగ్ వల్ల కొందరు ప్రేమను ఫీలవ్వుతారు. మరికొందరు ఓదార్పును పొందుతారు. ఇలా ఒక్కో హగ్‌కు ఒక్కో కారణం ఉంది. అంతేకాదు.. హగ్ వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. అవేంటో తెలుసుకోండి మరి. 


కౌగిలింత, ఆలింగనం, వాటేసుకోవడం.. ఇవన్నీ ‘హగ్’ ఫ్యామిలీకి చెందినవే. హగ్ వల్ల కలిగే ఈ ప్రయోజనాలు గురించి తెలిస్తే.. మీరు కూడా ఈ రోజు నుంచే హగ్స్ ఇవ్వడం మొదలుపెడతారు. ముందుగా ఈ హగ్స్ వల్ల కలిగే ప్రయోజనాలు, శరీరంలో కలిగే మార్పులు గురించి తెలుసుకుందాం.   


ముందుగా చెప్పుకున్నట్లే.. ఇద్దరు స్నేహితుల మధ్య హగ్.. ఒక ఓదార్పు, ఆప్యాయ పలకరింత. ఆయా వ్యక్తుల మధ్య ఉండే బంధాలు, స్నేహాం, ఉద్దేశాలను బట్టి.. హగ్‌కు అర్థాలు మారిపోతుంటాయి. హగ్ అనేది ప్రేమను చూపించేందుకు చక్కని మార్గం. ఒక మనిషి మనకు తోడుగా ఉన్నాడనే భావన కేవలం హగ్‌తోనే వస్తుంది. కొందరికైతే ఆ బిగి కౌగిలిలో అలాగే ఉండిపోవాలనే భావన కలుగుతుంది. అలా మిమ్మల్ని ఎవరైనా గట్టిగా హత్తుకుని ఉండిపోతే.. వారు మిమ్మల్ని ఎంతో ఇష్టపడుతున్నారని, మీతోనే ఉండిపోవాలని అనుకుంటున్నారని గుర్తించండి. ఎందుకంటే.. కొందరు తమ మనసులో భావాలను నేరుగా చెప్పలేరు. హగ్స్‌తో మాత్రమే చెబుతారు. 
 
కౌగిలింత ఆరోగ్యానికి మంచిదే: హగ్ వల్ల అనుభూతి గురించి ఇప్పుడు తెలుసుకున్నాం. దాని ప్రయోజనాలు గురించి తెలిస్తే.. తప్పకుండా ఆశ్చర్యపోతారు. పలు పరిశోధనల ప్రకారం.. హగ్ చేసుకోవడం వల్ల బుర్రలో ఉండే టెన్షన్లు అన్నీ తొలగిపోతాయట. ఎందుకంటే.. కౌగిలింత సమయంలో థైమస్ గ్రంథి ఉత్తేజానికి గురవ్వుతుంది. దీనివల్ల తెల్ల రక్త కణాల సంఖ్య పెరుగుతుంది. ఈ ప్రక్రియ వల్ల ఒళ్లు నొప్పులు, కండరాల నొప్పులు తగ్గుతాయట. రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ఒత్తిడికి గురయ్యేవారికి ఉపశమనం కలిగించేందు కూడా హగ్గే. ఎందుకంటే.. ఎవరినైనా హత్తుకున్నప్పుడు.. మెదడులోని సెరోటోనిన్ అనే హార్మోన్ ఉత్పత్తి పెరుగుతుంది. ఫలితంగా బాధలో ఉన్న వ్యక్తిలో ఒత్తడి దూరమై సంతోషం నెలకొంటుంది. అయితే, బిగువుగా కౌగిలించుకుంటేనే ఆ ఫలితం ఉంటుంది. మీరు బరువు తగ్గాలనుకున్నా.. కౌగిలింత మంచిదే. రోజులో ఒకటి రెండుసార్లు మీకు నచ్చిన వ్యక్తిని రెండు మూడు సార్లు గట్టిగా కౌగిలించుకుంటే శరీరంలోని క్యాలరీలు బాగా ఖర్చవుతాయట. 
  
ఈ రోజుల్లో పలకరింపులు కూడా హగ్స్‌తోనే జరుగుతున్నాయి. అయితే, బిగి కౌగిలిలోకి రాదు. జస్ట్ అలా భుజాలను తాకి వెనక్కి వెళ్లడం. ఈ హగ్ వల్ల స్నేహం బలోపేతం అవుతుంది. నేరుగా ఒకరినొకరు హగ్ చేసుకోవడమనేది బహిరంగంగా చేసుకోవడం కష్టం. అయితే, అమ్మాయిలు.. అబ్బాయి గుండెలపై వాలిపోయే చేసుకొనే హగ్.. వారు మిస్ అవుతున్నట్లు లెక్క. తనకు నచ్చిన వ్యక్తి దూరంగా వెళ్తున్నప్పుడు అమ్మాయిలు ఎక్కువగా ఇలాంటి హగ్స్ ఇస్తారు. ఇది వారిపై ఉండే ప్రేమను వ్యక్తం చేస్తుంది. మీకు ఎవరైనా ఇలాంటి హగ్ ఇచ్చారంటే.. జీవితంలో ఎప్పుడు మిస్ చేసుకోకండి.


Also Read: ఇదో వింత గ్రామం.. మగాళ్లు పెళ్లి చేసుకోరు.. తమ పిల్లలను పెంచరు.. కానీ, రాత్రయితే..


ఇలా హగ్ చేసుకుంటే శృంగార భావనలు..: మీరు ఏకాంతంలో ఉన్నప్పుడు ఎవరైనా వెనుక నుంచి వాటేసుకుంటే.. శృంగారానికి సిగ్నల్ ఇస్తున్నట్లే. ఆ కౌగిలి భలే థ్రిల్ ఇవ్వడమే కాదు. మనసును తేలిక చేస్తూ.. శృంగార కోరికలను రగిలిస్తుంది. అందుకే.. బ్యాక్ హగ్ అంత పాపులర్. దీన్నే ‘స్పూనింగ్ హగ్’ అని కూడా అంటారు. బ్యాక్ హగ్ తర్వాత జరిగే స్ట్రైట్ హగ్ (అంటే నేరుగా కౌగిలించుకోవడం) మరింత ప్రేరణ కలిగిస్తుంది. ఆ సమయంలో ఒకరినొకరు అల్లుకుపోతారు. అంటే.. ఇద్దరి చేతులు తాడుల్లా ఒకరినొకరిని బలంగా కట్టేస్తాయి. గాలి కూడా చొరబడనంతగా ఈ కౌగిలి ఉంటుంది. ఆ తర్వాత అదరాలను అందుకుని.. ఆ తర్వాత ఏం చేస్తారో మీకు తెలిసిందే. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను వెనుక నుంచి హగ్ చేసుకుంటారు. ఇది వారి మధ్య ఉండే ఆప్యాయతా, ప్రేమానురాగాలను తెలియజేస్తుంది. మరి తెలిసిందిగా.. ఏ హగ్‌కు ఎంత పవర్ ఉందో. కాబట్టి.. ఈసారి మీరు కూడా హగ్‌తో గుండెలో భారాన్ని దించేసుకోండి. నచ్చిన వ్యక్తిని ఒత్తిడి నుంచి దూరం చేయండి. ఏకాంత క్షణాలను ప్రేమతో గడిపేయండి.



Read Also: ఈ ఏడాది మనదేశంలో ఎక్కువ మంది వెతికిన టాప్ 10 రెసిపీలు ఇవే


Read Also: ఏడవండి.. గట్టిగా ఏడ్చి మీ బాధను తగ్గించుకోండి, కొత్తగా ఏడుపు గదుల ప్రాజెక్ట్


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి