ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మోడల్ స్కూళ్లలో పలు ఉద్యోగాలను భర్తీ చేయనుంది. మొత్తం 282 పోస్టులను భర్తీ చేయనున్నట్లు నోటిపికేషన్ లో పేర్కొంది. పాఠశాల విద్యాశాఖ ప్రతిపాదనలకు ఏపీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
మొత్తం 282 ఖాళీలకు గానూ.. ఈ నోటిఫికేషన్ విడుదలైంది. 211 పోస్టు గ్రాడ్యూయేట్ టీచర్లు, 71 ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టులు ఉన్నట్లు ప్రకటనలో తెలిపారు. ఈ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ త్వరలోనే ప్రారంభం అవనుంది. అయితే కాంట్రాక్ట్ పద్ధతిలోనే ఈ ఉద్యోగాలను భర్తీ నోటిఫికేషన్ విడుదల కానున్నట్టు తెలుస్తోంది.
గెస్ట్ ఫ్యాకల్టీకి ప్రాధాన్యత
మోడల్ స్కూల్‌లలో గెస్ట్ ఫ్యాకల్టీగా పని చేస్తున్న పార్ట్‌టైమ్ టీచర్లకు ఈ నోటిఫికేషన్ లో ప్రాధాన్యత ఇస్తారు. మొత్తం 165 మోడళ్ల స్కూళ్లలో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. జులై 1 తేదీ నాటికి 18-52 ఏళ్ల వయస్సు ఉన్న అభ్యర్థులు మాత్రమే అప్లై చేసకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ఈ నెల 3న ప్రారంభమైంది. 07 జనవరి 2022.., సాయంత్ర 5 గంటల వరకు ఆన్ లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.
2009లో మోడల్ స్కూళ్లు ఏర్పాటు:
కేంద్ర ప్రభుత్వ పథకం ద్వారా 2009లో మోడల్ స్కూళ్లు ఏర్పాటయ్యాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 355 స్కూళ్లు ఏర్పాటు కాగా విభజన అనంతరం ఏపీకి 165 స్కూళ్లు కేటాయించారు. వీటిల్లో మొత్తం 91,520 సీట్లు అందుబాటులో ఉండగా 65,600 సెకండరీ ఎడ్యుకేషన్, 25,920 ఇంటర్ విద్యకు సంబంధించినవి ఉన్నాయి. ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ గ్రూపులతో ఇంటర్ బోధన జరుగుతోంది. ప్రారంభంలో ఈ స్కూళ్లలో చేరికలు తక్కువగా ఉండగా ఇప్పుడు సీట్లకు డిమాండ్ పెరిగింది.
Also Read: MIDHANI Recruitment 2022: హైదరాబాద్ మిధానిలో ఉద్యోగాలు.. లక్షల్లో వేతనం.. అప్లై చేసుకోండిలా..
Also Read: BEL Recruitment: భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ లో ఉద్యోగాలు.. ఎలా అప్లై చేయాలో తెలుసా?
Also Read: APPSC Jobs Recruitment: ఏపీపీఎస్సీ నోటిఫికేషన్.. ఉద్యోగాల వివరాలివే.. దరఖాస్తుకు చివరితేదీ ఎప్పుడంటే
Also Read: Omicron Cases in India: ఓవైపు ఒమిక్రాన్ దడ.. మరోవైపు కరోనా కలవరం.. కొత్తగా 33 వేల కేసులు