భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) నిరుద్యోగులకు గుడ్ న్యూస్  చెప్పింది. పలు ఉద్యోగాలను భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 10 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్ లో తెలిపింది. ప్రాజెక్ట్ ఇంజనీర్ విభాగంలో ఈ ఖాళీలు ఉన్నాయి. అర్హత, ఆసక్తి ఉన్నవారు.. జనవరి 6వ తేదీలోపు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.  


అప్లై చేయాలనుకునే అభ్యర్థులు.. అప్లికేషన్ ఫీజుగా రూ. 500 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, Pw BD అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది. ఈ ఉద్యోగానికి ఎంపికైన వారు.. నాలుగు సంవత్సరాల పాటు.. కాంట్రాక్ట్ విధానంలో పని చేయాలి. ఎంపికైన వారికి.. రూ.40 వేల నుంచి రూ.55 వేల వరకు వేతనం ఉంటుంది.


ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్, టెలికమ్యూనికేషన్ లేదా మెకానికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ లో బీఈ/బీటెక్ చేసిన వారు అప్లై చేసుకోవాలి. అభ్యర్థులకు సంబంధింత.. విద్యార్హతలో 50 శాతం మార్కులు సాధించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, PwBD అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించి ఉంటే చాలు. 


https://www.bel-india.in/Default.aspx అధికారిక వెబ్ సైట్ కు వెళ్లాలి. అందులోనుంచి అప్లికేషన్ ఫామ్ డౌన్ లోడ్ చేసుకోవాలి. తర్వాత అప్లికేషన్ ఫామ్ ను నింపాలి. నోటిఫికేషన్ లో చెప్పిన డాక్యుమెంట్ల ప్రకారం... జత చేయాలి. పోస్టు ద్వారా కింద చెప్పిన అడ్రస్ కు పంపించాలి.
Senior Deputy General Manager (HR), Naval Systems SBU, Bharat Electronics Limited, Jalahalli Post, Bangalore 560013, Karnataka చిరునామకు చివరితేదీలోపు అప్లికేషన్ పంపాలి.


Also Read: APPSC Jobs Recruitment: ఏపీపీఎస్సీ నోటిఫికేషన్.. ఉద్యోగాల వివరాలివే.. దరఖాస్తుకు చివరితేదీ ఎప్పుడంటే


Also Read: UPSC Recruitment: యూపీఎస్సీలో ఉద్యోగాలు.. అర్హులు ఎవరు? ఎలా అప్లై చేసుకోవాలి 


Also Read: ONGC Recruitment 2021: ఓఎన్​జీసీలో ఉద్యోగాలు.. దరఖాస్తుకు జనవరి 4న చివరి తేదీ.. అప్లై చేసుకోండిలా..


Also Read: సినిమా చూసిన టైంలో పైసా ఖర్చు లేకుండా యానిమేషన్ నేర్చుకోండిలా.. కొత్త సంవత్సరంలో కొత్తగా ట్రై చేయండి..


Also Read: ఇలాంటి కోర్సులపై ఓ లుక్కెయండి... ఏమో మీ భవిష్యత్ వీటితోనే ఉందేమో!


Also Read: JEE Main 2022 Registrations Soon: జేఈఈ మెయిన్ 2022 రిజిస్ట్రేషన్స్.. అర్హత నుంచి పరీక్ష వరకు తెలుసుకోవాల్సినవి ఇవే