దేశంలో కరోనా, ఒమిక్రాన్ వ్యాప్తి పెరుగుతోన్న కారణంగా ఇప్పటికే పలు రాష్ట్రాలు ఆంక్షల బాట పట్టాయి. తాజాగా బంగాల్ కూడా ఆ జాబితాలో చేర్చింది. వైరస్ విజృంభణను అడ్డుకునేందుకు కఠిన ఆంక్షలు అమలు చేసేందుకు దీదీ సర్కార్ సిద్ధమైంది.
సోమవారం నుంచి జనవరి 15 వరకు ఈ ఆంక్షలు అమలు కానున్నట్లు బంగాల్ సర్కార్ ప్రకటించింది.
ఇవే ఆంక్షలు..
- పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు అన్నింటినీ వెంటనే మూసివేయాలి. 50 శాతం ఉద్యోగులతో అధికారిక కార్యకలాపాలు మాత్రమే నిర్వహించాలి.
- ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలన్నీ 50% ఉద్యోగులతోనే పనిచేయాలి. వర్క్ ఫ్రమ్ హోం విధానాన్ని వీలైనంత ఎక్కువ వినియోగించాలి.
- స్విమ్మింగ్ పూల్స్, స్పాస్, జిమ్‌లు, బ్యూటీ పార్లర్లు, సెలూన్లు వంటి వాటిని మూసివేయాలి.
- ఎంటర్‌టైన్‌మెంట్ పార్కులు, జూలు, పర్యటక ప్రాంతాలను మూసివేయాలి.
- షాపింగ్ మాల్స్, మార్కెట్ ప్రాంతాలు 50 శాతం కంటే ఎక్కువ మంది వినియోగదారులు లేకుండా నడపాలి. రాత్రి 10 వరకు మాత్రమే వీటికి అనుమతి.
- రెస్టారెంట్లు, బార్లు 50% సామర్థ్యంతో రాత్రి 10 గంటల వరకు నడపాలి.
- సనిమా హాళ్లు, థియేటర్లు 50% సీటింగ్ సామర్థ్యంతో నడుపుకోవచ్చు. వీటికి కూడా రాత్రి 10 గంటల వరకే అనుమతి.
- సమావేశాలు నిర్వహించుకోవాలంటే 200 మంది కంటే ఎక్కువ మంది ఉండకూడదు. లేదా 50 శాతం సామర్థ్యాన్ని మించకూడదు.
- ఆధ్యాత్మిక, సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాల్లో 50 మంది కంటే ఎక్కువ ఉండకూడదు.
- వివాహం సహా సంబంధిత ఫంక్షన్లలో 50 మంది కంటే ఎక్కువ ఉండకూడదు.
- అంతిమయాత్ర, అంత్యక్రియలకు 20 మంది కంటే ఎక్కువ మంది వెళ్లకూడదు.
- లోకల్ ట్రైన్లు 50 శాతం సీటింగ్ సామర్థ్యంతో రాత్రి 7 గంటల వరకు మాత్రమే నడపాలి.
- మెట్రో సర్వీసులు మాత్రం 50% సీటింగ్ సామర్థ్యంతో ప్రస్తుత ఉన్న సమయం వరకు నడుపుకోవచ్చు.
- రాత్రి 10 నుంచి ఉదయం 5 గంటల వరకు ఎలాంటి ప్రజా, ప్రైవేట్ రవాణాకు అనుమతి లేదు. అత్యవసర సర్వీసులను మాత్రమే అనుమతిస్తారు.
బంగాల్ కేసులు..
బంగాల్‌లో కొత్తగా 4,512 కరోనా కేసులు నమోదయ్యాయి. 9 మంది కరోనాతో మరణించారు. ఇద్దరికి ఒమిక్రాన్ నిర్ధరణైంది. మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 16కు చేరింది.
Also Read: UP Election 2022: తొలిసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో యోగి.. అయోధ్య నుంచేనా పోటీ!
Also Read: Omicron Cases in India: దేశంలో జెట్ స్పీడుతో ఒమిక్రాన్ వ్యాప్తి.. 1500 మార్కు దాటిన కేసులు
Also Read: Delhi HC on Marriage: 'అలా చెప్పి పెళ్లి చేయడం మోసమే..' దిల్లీ హైకోర్టు సంచలన తీర్పు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి