ABP  WhatsApp

UP Election 2022: తొలిసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో యోగి.. అయోధ్య నుంచేనా పోటీ!

ABP Desam Updated at: 28 Jan 2022 04:31 PM (IST)
Edited By: Murali Krishna

ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగుతున్నట్లు సీఎం యోగి ఆదిత్యనాథ్ తెలిపారు.

అసెంబ్లీ ఎన్నికల బరిలో యోగి ఆదిత్యనాథ్

NEXT

రానున్న ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేస్తున్నట్లు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. అయితే ఏ నియోజకవర్గం  నుంచి బరిలోకి దిగనున్నారనేది ఇంకా నిర్ణయించుకోలేదన్నారు. అయితే యోగి ఆదిత్యనాథ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం ఇదే తొలిసారి.



పార్టీ చెప్పిన చోట నేను పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఒక్కొక్క సమయంలో ఒక్కొక్కరి పాత్ర మారుతుంటుంది. ప్రతిసారి ఒకరు ప్రభుత్వంలోనే ఉండాలని లేదు.. పార్టీకి కూడా పనిచేయాల్సి ఉంటుంది.                                                     - యోగి ఆదిత్యనాథ్, యూపీ ముఖ్యమంత్రి


ఎక్కడి నుంచి?


యోగి ఆదిత్యనాథ్.. ఈ ఎన్నికల్లో అయోధ్య లేదా మధురా నుంచి పోటీ చేస్తారని వార్తలు వస్తున్నాయి. అయితే ఆయన సొంత నియోజకవర్గమైన గోరఖ్‌పుర్‌ నుంచి కూడా బరిలోకి దిగే అవకాశముందని సమాచారం. ప్రస్తుతం యోగి ఆదిత్యనాథ్.. యూపీ శాసనమండలి సభ్యునిగా ఉన్నారు. తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగుతున్నారు.


ఇదే అజెండా..


2017 ఎన్నికల్లో గత ప్రభుత్వ వైఫల్యాలే అజెండాగా ప్రచారం చేసి గెలిచామని యోగి ఆదిత్యనాథ్ అన్నారు. ఈ ఎన్నికల్లో తమ ప్రభుత్వం చేసిన సంక్షేమం, అభివృద్ధే ప్రచార అజెండాగా ముందుకెళ్తున్నామన్నారు.






300 యూనిట్లు ఉచిత కరెంటు హామీ ఇచ్చిన అఖిలేశ్ యాదవ్‌పై యోగి విమర్శలు చేశారు. 2017కు ముందు కేవలం ఐదు జిల్లాలకే విద్యుత్ సరఫరా ఉండేదని ఆరోపించారు.


Also Read: Omicron Cases in India: దేశంలో జెట్ స్పీడుతో ఒమిక్రాన్ వ్యాప్తి.. 1500 మార్కు దాటిన కేసులు


Also Read: Delhi HC on Marriage: 'అలా చెప్పి పెళ్లి చేయడం మోసమే..' దిల్లీ హైకోర్టు సంచలన తీర్పు


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at: 02 Jan 2022 01:56 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.