వంగవీటి రాధాకృష్ణ తనను హత్య చేసేందుకు రెక్కీ చేశారని చేసిన వ్యాఖ్యల హీట్ ఇంకా తగ్గలేదు. ప్రభుత్వం రాధాకు గన్ మెన్ లను నియమించినా... రాధా సెక్యూరిటీని తిరస్కరించారు. శనివారం చంద్రబాబు వంగవీటి రాధా ఇంటికి వచ్చి వివరాలు అడిగితెలుసుకున్నారు. వంగవీటి రాధా హత్యకు కుట్ర జరుగుతుందన్న వ్యాఖ్యలపై మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ స్పందించారు. రాధా హత్యకు రెక్కీ నిర్వహించినట్లు ఆధారాలు ఉంటే బయటపెట్టాలని వెల్లంపల్లి స్పందించారు. రాజకీయలబ్ధి కోసం రాధాను చంద్రబాబు వాడుకుంటున్నారని విమర్శించారు. తెలుగుదేశం ప్రభుత్వంలోనే వంగవీటి రంగా హత్య జరిగిందన్నారు. ఇప్పుడు అదే పార్టీలో రాధా ఉన్నారని విమర్శించారు. రాధాను రాజకీయాల్లో మార్చిపోయారన్న మంత్రి వెల్లంపల్లి... చంద్రబాబు చెప్పినట్లు వ్యవహరించకూడదని రాధాకు హితవు పలికారు.


Also Read:  సంక్రాంతికి మరో 10 ప్రత్యేక రైళ్లు ... దక్షిణ మధ్య రైల్వే ప్రకటన


దర్యాప్తు చేసేందుకు ప్రభుత్వం సిద్ధం


దొంగ‌లు ప‌డ్డ ఆరునెల‌ల‌కు కుక్కలు మెరుగుతున్నాయని మంత్రి వెలంప‌ల్లి ఎద్దేవా చేశారు. తన మనుగడ కోసం వంగవీటి రాధను చంద్రబాబు రాజకీయంగా వాడుకుంటున్నారని ఆరోపించారు. ఆధారాలు ఉంటే కేసు ద‌ర్యాప్తు చేస్తామని మంత్రి అన్నారు. అసెంబ్లీలో చంద్రబాబు సతీమణిని ఎవరూ ఏమీ అనకపోయినా అనుచిత వ్యాఖ్యలు చేశారని వెక్కివెక్కి ఏడ్చిన చంద్రబాబు తన పాచిక పారకపోవడంతో మాజీ కేంద్రమంత్రి అశోక గజపతిరాజు ఘటన అడ్డంపెట్టుకుని రాజకీయాలు చేశారన్నారు. అది కూడా ఆశించినంత ఫలితం లభించకపోవడంతో వంగవీటి రాధా రెక్కీ వ్యవహారాన్ని తన రాజకీయాల కోసం వాడుకోవాలని చంద్రబాబు చూస్తున్నారన్నారు. ఈ ఘటనపై తక్షణమే ముఖ్యమంత్రి జగన్ స్పందించి రాధాకు గన్ మెన్ ల‌ను పంపితే తిరస్కరించారన్నారు. దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మొరిగిన చందంగా రాధాను పరామర్శించేందుకు  వెళ్లిన చంద్రబాబు రాజకీయాలు నడుపుతున్నారని మంత్రి వెల్లంపల్లి ధ్వజమెత్తారు. ఇప్పటికైనా నిర్దిష్టమైన ఆధారాలు ఉంటే ఈ కేసు దర్యాప్తు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన ప్రకటించారు. 


Also Read: నెల్లూరులో కారు దగ్ధమైన ఘటన.. వెలుగులోకి మరిన్ని విషయాలు


ఆధారాలు లేకుండా హ‌త్యకు కుట్ర ఆరోపణలా..?


వంగ‌వీటి రాధాకృష్ణ త‌న హ‌త్యకు రెక్కి నిర్వహించారంటూ చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రల్లో హాట్ టాపిక్ గా మారాయి. స్వయంగా సీఎం జ‌గ‌న్ స్పందించిన గ‌న్ మెన్ ల‌ను కేటాయించాల‌ని ఆదేశించారు. అయితే గ‌న్ మెన్ ల‌ను రాధా తిర‌స్కరించారు. తాజాగా చంద్రబాబు రాధా ఇంటికి వెళ్లి పరామ‌ర్శించి ప్రభుత్వంపై విమ‌ర్శలు చేశారు. అయితే రాధా వ్యవ‌హారాన్ని రాజ‌కీయంగా వాడుకోవ‌టానికి టీడీపీ ప్రయ‌త్నిస్తుంద‌ని వైసీపీ నేత‌లు మండిప‌డుతున్నారు. ఆధారాలు లేకుండా హ‌త్యకు కుట్ర చేశారంటూ మాట్లాడ‌టం ఏమిటని మంత్రి వెలంప‌ల్లి వ్యాఖ్యలు చేశారు. ఆధారాలు ఇస్తే బాధ్యులపై క‌ఠిన చ‌ర్యలు తీసుకుంటామ‌ని స్పష్టం చేశారు. 


Also Read:  కొజ్జేపల్లి.. ఛీఛీ ఈ పేరు మా ఊరికే పెట్టాలా, గ్రామస్తుల నరకయాతన.. ఆ కథేంటో మీకు తెలుసా..!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి