కెరీర్ ఎంచుకునే ఆలోచనలు వచ్చినప్పుడు.. విద్యార్థులు ఆందోళనకు గురవుతుంటారు. ఏ కోర్సు ఎంచుకుంటే మంచిది. మార్కెట్ లో ఎలాంటి కోర్సులు ఉన్నాయనే వాటిపై దృష్టి పెట్టే ప్రయత్నం చేస్తారు. కొంతమంది ఏం చేయాలో తెలియక తికమక పడుతుంటారు. అలాంటి సమయంలోనే సరైన కోర్సు చేస్తేనే భవిష్యత్ లో ఆనందంగా ఉండేది. టెక్నాలజీ, తయారీ రంగం.. ఇలా అనేక రంగాల్లో.. వివిధ కోర్సులు మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి. అలాంటి కోర్సుల వివరాలు చూడండి..
డేటా సైన్స్ అనేది ఈ కాలంలో చాలా ముఖ్యమైన సబ్జెక్ట్. ఇంటర్నేట్ వాడకం పెరిగిన ఈ కాలంలో దీనికి చాలా డిమాండ్ ఉంది. మరికొన్ని సంవత్సరాల్లో ఈ రంగంలో ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా పెరగనున్నాయి. ఫ్యూచర్ లో మంచి మంచి ఉద్యోగాలు ఇందులో ఉండనున్నాయి. కంప్యూటర్స్, మాథ్స్, అనలైటిక్స్.. లాంటి సబ్జెక్టులపై ఆసక్తి ఉన్న వారు ఈ రంగాన్ని ఎంచుకుంటే మంచి భవిష్యత్ ఉండే అవకాశం ఉంది.
గేమ్ డిజైనింగ్.. గేమింగ్ గురించి.. చాలా మందికే తెలుసు.. కానీ ఓ మంచి.. నేర్చుకుంటే ఇదో మంచి కెరీర్. స్మార్ట్ ఫోన్ యుగంలో దీనికి క్రేజ్ ఉంది. ఎప్పటికప్పుడు రోజుకో కొత్త గేమ్ మార్కెట్ లోకి వస్తున్న విషయం తెలిసిందే. గేమ్ డిజైనింగ్ కోర్సులకు సంబంధించి.. డిగ్రీ చేసిన వారికి రానున్న రోజుల్లో మంచి డిమాండ్ ఉండనుంది.
సైబర్ సెక్యూరిటీ.. సైబర్ సెక్యూరిటీ గురించి.. ఈ రోజుల్లో అవగాహన చాలా అవసరం.. ప్రతీ విషయం ఆన్ లైన్ జరుగుతున్న ఈ రోజుల్లో.. సైబర్ సెక్యూరిటీకి కూడా చాలా మంది డిమాండ్ ఉంది. అంతెందుకు.. చాలా కంపెనీలు దీనికి ప్రాధాన్యం ఇస్తున్నాయి. రానున్న రోజుల్లో.. ఇంకా.. సైబర్ సెక్యూరిటీకి సంబంధించి.. భారీగా డిమాండ్ పెరగనుంది. సైబర్ సెక్యూరిటీ కోర్సు చేసి.. ప్రావీణ్యం సాధిస్తే.. మంచి పొజిషన్ కు మీరు వెళ్లవచ్చు.
డ్రగ్స్ గురించి అధ్యాయనం.., జీవచరాలపై అవి పని చేసే విధానాన్ని.. గురించి అధ్యాయనం చేసే శాస్త్రాన్ని.. ఫార్మకాలజీ అంటారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తున్నాం. కరోనాతో ఎన్ని ఇబ్బందులు పడుతున్నామో అర్థమవుతుంది. కరోనా పరిస్థితులు, కొత్త వ్యాధులు వస్తున్న ఇలాంటి సమయంలో.. ఫార్మకాలజీకి సంబంధించిన.. కోర్సులకు డిమాండ్ ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది. ఫార్మసిస్ట్, ఫర్మకాలజిస్ట్, మెడికల్ రైటర్, ఫార్మాస్యూటికల్ సేల్స్ రిప్రజెంటేటీవ్.. లాంటి ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి.
Also Read: TS Inter Results : కరోనా కాలం చదవులా ? ఇంటర్ బోర్డు పొరపాటా? వివాదంగా మారిన ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు !
Also Read: తెలుగు చదవలేరు.. ఇంగ్లీష్‌లో మాట్లడలేరు... కరోనాతో అటకెక్కిన చదువులు