ప్రధాని నరేంద్ర మోదీపై ప్రతిపక్ష పార్టీలు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాయి. ప్రధాని మోదీ ఓ అహంకారి అంటూ మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్ ఇటీవల చేసిన వ్యాఖ్యల ఆధారంగా కాంగ్రెస్ సహా విపక్షాలు మోదీపై ఆరోపణలు చేస్తున్నాయి. సత్యపాల్ మాలిక్ చేసిన వ్యాఖ్యల వీడియో ఇప్పటికే వైరల్ అయింది.
ఈ వీడియోను కాంగ్రెస్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తూ మోదీపై విమర్శలు కురిపించింది. కాంగ్రెస్ సీనియర్ మల్లికార్జున ఖర్గే సహా పవన్ ఖేరా వంటి నేతలు మోదీపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.
ప్రధాని మోదీ ఓ అహంకారని మేఘాలయ గవర్నర్ శ్రీ సత్యపాల్ మాలిక్ బహిర్గతంగా చెప్పారు. రైతు సమస్యలపై ఆయన మోదీతో చర్చించేందుకు వెళ్తే ప్రధాని ఇలా మాట్లాడారని ఆయన అంటున్నారు. నరేంద్ర మోదీ జీ.. ఇది నిజమేనా? - మలికార్జున ఖర్గే, రాజ్యసభ ప్రతిపక్ష నేత
మోదీ అవే వింటారు..
గవర్నర్ సత్యపాల్ మాలిక్ వీడియోపై ఏఐఎమ్ఐఎమ్ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ కూడా స్పందించారు.
సాగు చట్టాలపై చేసిన పోరాటంలో 500 మంది రైతులు చనిపోయారని మోదీతో గవర్నర్ సత్యపాల్ మాలిక్ చెబితే ప్రధాని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీన్ని బట్టి నిజాలు వినే పరిస్థితిలో ప్రధాని మోదీ లేరు. అందులోనూ గవర్నర్ చెబితేనే వినలేదు.. ఇక ప్రజలు చెబితే ఏం వింటారు? ఆయనకు ప్రశంసలే కావాలి. - అసదుద్దీన్ ఓవైసీ, ఏఐఎమ్ఐఎమ్ అధ్యక్షుడు
వైరల్ వీడియో..
రైతుల ఆందోళనలపై చర్చించిన సమావేశంలో ప్రధాని చాలా అహంకారిగా ప్రవర్తించారని మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హరియాణాలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొని ఈ మేరకు మాట్లాడారు.
రైతుల సమస్యలపై చర్చించినప్పుడు ఐదు నిమిషాల పాటు ప్రధానితో వాగ్వాదం జరిగింది. 500 మంది రైతులు మరణించారని ప్రశ్నించినప్పుడు.. మోదీ చాలా అహంకారిగా స్పందించారు. 'నా కోసం చనిపోయారా?' అని అన్నారు. మీరు ప్రధానిగా ఉన్నప్పుడు చనిపోయారని నేను చెప్పాను. - సత్యపాల్ మాలిక్, మేఘాలయ గవర్నర్
Also Read: BTS Jungkook Instagram Post: అరె ఏంట్రా ఇది.. పప్పీలతో పడుకుంటే 10 లక్షల లైక్‌లా.. గిన్నిస్ రికార్డ్ కూడా!
Also Read: WHO on Covid 19: 2022లో కొవిడ్ అంతం.. కానీ అలా చేస్తేనే సాధ్యం: డబ్ల్యూహెచ్ఓ
Also Read: Omicron Cases in India: ఓవైపు ఒమిక్రాన్ దడ.. మరోవైపు కరోనా కలవరం.. కొత్తగా 33 వేల కేసులు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి