WHO on Covid 19: 2022లో కొవిడ్ అంతం.. కానీ అలా చేస్తేనే సాధ్యం: డబ్ల్యూహెచ్ఓ

ABP Desam Updated at: 03 Jan 2022 01:26 PM (IST)
Edited By: Murali Krishna

కొవిడ్ 19కి ఈ ఏడాదిలోనే ముగింపు పలికే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.

డబ్ల్యూహెచ్ఓ

NEXT PREV

ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ భయాలు నెలకొన్న వేళ ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) శుభవార్త చెప్పింది. కరోనా సంక్షోభంతో మూడో ఏడాదిలోకి అడుగుపెట్టిన ప్రపంచానికి 2022లో ఈ వైరస్ ముంగిపు చూసే అవకాశం ఉందని డబ్ల్యూహెచ్ఓ డెైరెక్టర్ టెడ్రోస్ అథనోమ్ అన్నారు. 


ఈ ఏడాదిలో ప్రపంచం ఎదుర్కొనే ఆరోగ్య ముప్పు కేవలం కొవిడ్ కాదని ఇంకా చాలానే ఉన్నాయని టెడ్రోస్ అన్నారు. కొవిడ్ సంక్షోభంలో పడిపోయిన ప్రజలు సాధారణ వ్యాక్సినేషన్, ఫ్యామిలీ ప్లానింగ్, మిగిలి సాంక్రమిక రోగాలకు చికిత్స తీసుకోవడంలో అలసత్వం చూపారని టెడ్రోస్ అన్నారు.



కరోనాను కట్టడి చేసేందుకు, చికిత్స అందించేందుకు చాలా కొత్త సాధనాలు ఉన్నాయి. సుదీర్ఘ కాలం పాటు దేశాల మధ్య అసమానతలు కొనసాగితే మనం నియంత్రించలేనంతగా, అంచనా వేయలేనంతగా వైరస్​ ప్రమాదకరంగా మారుతుంది. అసమానతలకు ముగింపు పలికితేనే ఈ మహమ్మారిని అంతం చేయగలుగుతాం. కొవిడ్​-19 మహమ్మారి వచ్చి మూడో ఏడాదిలోకి అడుగుపెడుతున్న క్రమంలో ఈ సంవత్సరంలోనే దానికి ముగింపు ఉంటుందనే నమ్మకం ఉంది. కానీ, మనం కలిసికట్టుగా పోరాడితేనే అది సాధ్యమవుతుంది.                                           - టెడ్రోస్​ అథనోమ్​, డబ్ల్యూహెచ్​ఓ అధినేత


ఒమిక్రాన్ వ్యాప్తి..


భారత్‌లో కరోనా వ్యాప్తి మళ్లీ పెరిగింది. కరోనాతో పాటు ఒమిక్రాన్ కేసులు కూడా భారీగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. దేశంలో కొత్తగా 33,750 కరోనా కేసులు నమోదయ్యాయి. మరోవైపు ఒమిక్రాన్ కేసుల సంఖ్య కూడా భారీగా పెరిగింది. మొత్తం కేసుల సంఖ్య 1700 మార్కు దాటింది. 


మహారాష్ట్రలో కొత్తగా 50 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. మరోవైపు 11,877 కరోనా కేసులు వెలుగుచూశాయి. 9 మంది కరోనాతో మృతి చెందారు. మొత్తం మరణాల సంఖ్య 1,41,542కు చేరింది.







రాష్ట్రంలో 42,024 యాక్టివ్ కేసులు ఉన్నట్లు మహారాష్ట్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. కొత్తగా నమోదైన 11,877 కరోనా కేసుల్లో ఒక్క ముంబయిలోనే 7792 రావడం ఆందోళన కలిగిస్తోంది. కొత్తగా ముంబయిలోనే 8,063 కేసులు నమోదయ్యాయి


Also Read: Omicron Cases in India: ఓవైపు ఒమిక్రాన్ దడ.. మరోవైపు కరోనా కలవరం.. కొత్తగా 33 వేల కేసులు


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at: 03 Jan 2022 01:20 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.