ఈ ఏడాది ప్రారంభంలో, ఒకటో తారీఖున 'ఆర్ఆర్ఆర్' టీమ్ ప్రేక్షకులకు షాక్ ఇచ్చింది. తమ సినిమాను జనవరి 7న విడుదల చేయడం లేదని వెల్లడించింది. దాన్ని 'అతిథి దేవో భవ' చిత్రబృందం తమకు సదావకాశంగా మలుచుకుంది. తమ సినిమాను జనవరి 7న విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది. ఆది సాయి కుమార్, నువేక్ష జంటగా పొలిమేర నాగేశ్వర్ దర్శకత్వం వహించిన సినిమా 'అతిథి దేవో భవ'. ఈ సినిమాతో మిర్యాల రాజబాబు, మిర్యాల అశోక్ రెడ్డి నిర్మాతలుగా పరిచయం అవుతున్నారు. నట సింహ నందమూరి బాలకృష్ణ హీరోగా 'అఖండ' వంటి భారీ బ్లాక్ బస్టర్ సినిమా నిర్మించిన మిర్యాల రవీందర్ రెడ్డి వీరిద్దరూ స్వయానా సోదరులు. సినిమా ఈ వారం విడుదల కానున్న నేపథ్యంలో మీడియాతో మాట్లాడారు.


"ఒమిక్రాన్ వైర‌స్‌ వ్యాప్తి చిత్ర ప‌రిశ్ర‌మలో కాస్త గంద‌ర‌గోళ వాతావరణం సృష్టించినా, పరిస్థితులు కొంత అనుకూలంగా లేనప్పటికీ... క‌థ‌పై న‌మ్మ‌కంతో మా 'అతిధి దేవో భవ' సినిమాను విడుద‌ల చేస్తున్నాం. యువతరంతో పాటు కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలు సినిమాలో ఉన్నాయి. ఆది సాయి కుమార్‌గారి కెరీర్‌లో బెస్ట్ సినిమా అవుతుంది. ఫస్టాఫ్ ల‌వ‌బుల్‌గా, సెకండాఫ్ థ్రిల్లింగ్ ఎమోష‌న్స్‌తో సినిమా నడుస్తుంది. ఇది హార్ర‌ర్ క‌థ మాత్రం కాదు. ట్రైలర్ చూసి అలా అనుకోవద్దు. ఈ రోజే సినిమా సెన్సార్ పూర్త‌యింది. యు/ఎ స‌ర్టిఫికెట్ ఇచ్చారు. మంచి సినిమా తీశార‌ని ప్ర‌శంస ద‌క్కింది. మా సినిమాకు శేఖ‌ర్ చంద్ర సంగీతం హైలైట్‌ అవుతుంది. కొత్త నిర్మాత‌ల‌కు థియేట‌ర్లు ఇవ్వరని, స‌మ‌స్య‌లు ఉంటాయ‌ని అనుకున్నాం. మాకు ఒక‌ ర‌కంగా భయం వేసింది. అయితే... క‌థ‌పై వున్న న‌మ్మ‌కమే మ‌మ్మ‌ల్ని ముందుకు నెట్టింది. తొలుత మేము ఓ క‌థ‌ అనుకున్నాం. దానికి భారీ బ‌డ్జెట్ అవుతుంది. దాని కంటే ముందు ఓ మీడియం బడ్జెట్ సినిమా చేద్దామ‌ని ఆదితో ఈ సినిమా చేశాం. మా సోద‌రుడు ర‌వీంద‌ర్ రెడ్డి కూడా చాలా బాగా ప్రోత్స‌హించారు" అని మిర్యాల రాజాబాబు, మిర్యాల అశోక్ రెడ్డి చెప్పారు. న‌వంబ‌ర్‌లో విడుద‌ల చేయాల‌నుకున్నా... నేపథ్య సంగీత ప‌నులు పూర్తి కాలేదని, అన్ని పనులు పూర్త‌య్యాక జ‌న‌వ‌రి 26న విడుద‌ల చేద్దామ‌నుకున్నారట. 'ఆర్ఆర్ఆర్' వాయిదా పడటంతో జనవరి 7న విడుదల చేయాలని ముందుకొచ్చారు.   
మా సోద‌రుడు రాజాబాబు వ్యాపార రంగంలో వున్నాడు. మ‌రో సోద‌రుడు అఖండ వంటి సినిమాలు తీస్తున్నాడు. నేను లెక్చ‌ర‌ర్‌గా వున్నా సినిమాలు ఎక్కువ‌గా చూడ‌డంతో ఎప్ప‌టికైనా ద‌ర్శ‌క‌త్వం చేయాల‌నేది నా గోల్. అందుకే మొద‌ట‌గా ఒక మంచి సినిమా చేయాల‌ని ‘అతిధి దేవో భవ’ సినిమా చేశాం.
Also Read: పవన్ కల్యాణ్ న్యాయం కోసమే పోరాడతాడు - చిరంజీవి
"ఈ సినిమాకు వేణుగోపాల్ కథ అందించారు. నేను, మా వ‌దిన కలిసి స్క్రీన్ ప్లే రాశాం. సంభాష‌ణ‌లు రాయ‌డానికి చిన్న‌త‌నం నుంచి సినిమాలపై, సమాజంపై ఉన్న ప‌రిశీల‌న‌తో పాటు లెక్చ‌ర‌ర్‌గా చేసిన అనుభ‌వం కూడా దోహ‌ద‌ప‌డింది. నేను  సినిమాపై మ‌క్కువ‌తోనే లెక్చ‌ర‌ర్ ఉద్యోగ్యం వ‌దిలేసి వ‌చ్చాను" అశోక్ రెడ్డి తెలిపారు.
Also Read: బాసూ... క్లాస్‌గా మెగాస్టార్ మాస్ స్టెప్పేస్తే? ఫుల్ సాంగ్ వచ్చేసింది... చూశారా?
Also Read: 'రాధే శ్యామ్' నిర్మాతలకు కొత్త తలనొప్పి... రోజుకు ఓసారి ఆ మాట చెప్పాల్సిందేనా?
Also Read: త్రివిక్రమ్ క్లాప్‌తో సినిమా మొదలు... బుధవారం నుంచి క్లాసులు!
Also Read: కృష్ణుడే సత్యభామ కాళ్లు పట్టుకున్నాడు... బాలకృషుడు ఓ లెక్కా!?
Also Read: లెఫ్ట్ హ్యాండ్ రెడీ.. వాళ్లు ఎదురుపడితే దబిడిదిబిడే.. వార్నింగ్ ఇచ్చిన బాలయ్య..
Also Read: The Boss: రామ్ గోపాల్ వర్మ బాబాగా మారితే?
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి