నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం కరటంపాడు సచివాలయం అది. ఉన్నట్టుండి ఓ మహిళ లోపలికి వచ్చింది. మహిళా పోలీస్ కి కంప్లయింట్ ఇవ్వాలని చెప్పింది. ఇంతకీ ఏంటమ్మా నీ కష్టం అని అడిగితే.. ఇదిగో మీ సచివాలయంలో పనిచేసే వెల్ఫేర్ అసిస్టెంటే నాకు అసలు సమస్య అని చెప్పింది. తన భర్తను ఆమె లొంగదీసుకుందని, అక్రమ సంబంధం కొనసాగిస్తోందంటూ ఆరోపించింది. పెళ్లై, పిల్లలున్నా కూడా తన భర్తతో అక్రమ సంబంధం పెట్టుకుని తన కాపురంలో నిప్పులు పోసిందని మండిపడింది. ఆ దెబ్బతో వెల్ఫేర్ అసిస్టెంట్, బాధిత మహిళ జుట్టు జుట్టు పట్టుకుని సచివాలయం బయటే కొట్టుకున్నారు.
అసలేం జరిగింది..?
వింజమూరు మండల కేంద్రంలో నివసించే అబ్దుల్ భాషా (సర్దార్) అనే యువకుడు అదే గ్రామంలో నివసించే నవ్యభారతి అనే యువతిని ప్రేమించి ఎనిమిదేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. వారిది కులాంతర వివాహం కాగా.. ముగ్గురు పిల్లలున్నారు. ఈ క్రమంలో కరటంపాడు సచివాలయంలో పనిచేసే వెల్ఫేర్ అసిస్టెంట్ రషీదాకు తన భర్తకు అక్రమ సంబంధం ఏర్పడిందని ఆరోపిస్తోంది నవ్య భారతి. గతంలో వారు బంధువులు అని అందర్నీ నమ్మించేవారని, తీరా వారి మధ్య అక్రమ సంబంధం ఉందని చెబుతోంది నవ్య భారతి. తనకు తెలియకుండా ఇద్దరూ చాలా ఏళ్లు.. వ్యవహారం నడిపారని, ఇటీవల ఇది శృతి మించిందని, తన ముందే ఫోన్లు, మెసేజ్ లు ఇచ్చుకునేవారని అంటోంది.
ఆమె భర్తకి అన్నీ తెలుసు..
తన భర్తని వలలో వేసుకున్న రషీదా భర్తకి కూడా వారిద్దరి వ్యవహారం తెలుసని చెబుతోంది నవ్య భారతి. అదేమని అడిగితే, తనని విడాకులు తీసుకోవాలని చెబుతోందని అంటోంది. నేరుగా విషయం తేల్చుకునేందుకే సచివాలయం వెళ్లి, రషీదాను నిలదీశానంటోంది నవ్య భారతి.
పోలీస్ స్టేషన్ కి చేరిన పంచాయితీ..
ప్రస్తుతం నవ్య భారతి.. తన భర్తపైన, తన భర్తతో అక్రమ సంబంధం పెట్టుకుందని ఆరోపిస్తూ రషీదా అనే మహిళపైన ఆత్మకూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వచ్చింది. తనకు న్యాయం చేయాలని, తన పిల్లలకు అన్యాయం జరక్కుండా చూడాలని వేడుకుంటోంది.
Also Read: TDP One Side Love : ఏపీలో ట్రయాంగిల్ పొలిటికల్ లవ్ స్టోరీ ! క్లైమాక్స్ మలుపు తిప్పుతుందా ?
Also Read: AP Farmers: ఆ రైతులకు ఏపీ ప్రభుత్వం ప్రోత్సాహకాలు.. త్వరలోనే సబ్సిడీ, పంటలకు రుణాలు
Also Read: Crime News: ఇద్దరు సత్రంలో.. మరో ఇద్దరు కృష్ణానదిలో.. విజయవాడలో తెలంగాణవాసుల సూసైడ్