ఉత్తరాఖండ్‌లో పూర్తి స్థాయిలో కరోనా ఆంక్షలను అమలు చేయడం ప్రారంభిచారు.ఈ నెల పదహారో తేదీ వరకు ఎన్నికల ర్యాలీలను నిషేధించారు. స్కూల్స్, కాలేజీలకు సెలవులు ప్రకటించారు. అదే సమయంలో రాత్రి కర్ఫ్యూ కూడా విధించారు. రాత్రి పది గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. ఉత్తరాఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి. ఎన్నికల సంఘం షెడ్యూల్ కూడా ప్రకటించింది. ఈసీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు ముందే ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఆంక్షలు విధించింది.
ఇక అన్ని రకాల వ్యాపారాలపైనా ఆంక్షలు విధించారు. షాపింగ్ మాల్స్, జిమ్,సినిమా హాళ్లు, స్పాలు, సెలూన్లు, ఎమ్యూజ్ మెంట్ పార్కులు వంటివి యాభై శాతం ఆక్యుపెన్సీతో మాత్రమే నడిపించాలని ఆదేశించారు. శుభకార్యాలు జరిగే మండపాల్లో ప్రస్తుతం ఎంత సామర్థ్యం ఉందో దాంట్లో సగం మాత్రమే అనుమతిస్తారు.
Also Read: UP Election 2021: 'యూపీ ఎలక్షన్లు 2024 సాధారణ ఎన్నికలకు సెమీస్ కావు'
ఉత్తరాఖండ్‌లో కరోనా విజృంభిస్తోంది. తాజాగా ఒక్క రోజులో ఆరు వందలకుపైగా కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో పదమూడు వందలకుపైగా యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. గత ఏడు నెలల కాలంలో ఒక్క రోజులో అత్యధికంగా నమోదైన కేసులు ఇవే. ఈ కారణంగా ఉత్తరాఖండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాజకీయ పార్టీలు కూడా ఇప్పటికే ఎన్నికలు ఉన్న రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలు భారీ ర్యాలీలు నిర్వహించకూడదని నిర్ణయం తీసుకున్నాయి.
Also Read: పంజాబ్ ఎన్నికల్లో భాజాపా- కెప్టెన్ దోస్తీ.. 101 శాతం విజయం తమదేనని ధీమా
ఇక పర్యాటక పరంగా అత్యంత కీలకమైన రాష్ట్రం కావడంతో పెద్ద ఎత్తున టూరిస్టులు ఉత్తరాఖండ్‌కు వస్తూంటారు. అయితే రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న వారినే ఇక ఉత్తరాఖండ్‌లోకి అనుమతించాలని నిర్ణయించారు. అలాగే 72 గంటల ముందు చేయించుకున్న ఆర్టీపీసీఆర్ టెస్టు రిపోర్టు కూడా తెచ్చుకోవాల్సి ఉంటుంది.
Also Read: Karnataka Congress MLA: 'స్పీకర్ సారు, ఎమ్మెల్యే గారు.. అది జోక్ కాదండి.. బాధ్యత ఉండక్కర్లేదా?'