భారతదేశంలో కరోనా వైరస్ మరోసారి ఉగ్రరూపం దాల్చుతోంది. ప్రతిరోజూ లక్షకు పైగా కరోనా కేసులు నమోదు కావడం ఆందోళనకు గురి చేస్తోంది. గడిచిన 24 గంటల్లో 1,41,986 కోవిడ్ కేసులు నమోదుకాగా దేశంలో నిన్న ఒక్కరోజులో 40,895 రికవరీ అయ్యారు. అదే సమయంలో 285 మందిని కరోనా మహమ్మారి బలిగొంది.
రోజువారీ పాజిటివిటీ రేటు: 9.28%
దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసులు: 4,72,169
మొత్తం రికవరీల సంఖ్య: 3,44,12,740
కరోనా మరణాలు: 4,83,463
మొత్తం టీకాలు: 150.06 కోట్ల డోసులు
మూడు వేలు దాటిన ఒమిక్రాన్ కేసులు..
దేశంలో ఒమిక్రాన్ వ్యాప్తి పెరుగుతోన్న క్రమంలో కర్ణాటక, ఢిల్లీ రాష్ట్రాలు వీకెండ్ లాక్ డౌన్ ప్రకటించాయి. గడిచిన 24 గంటల్లో 64 ఒమిక్రాన్ కేసులు నమోదు కాగా, మొత్తం ఒమిక్రాన్ బాధితుల సంఖ్య 3,071కు చేరుకున్నాయి. వీరిలో ఇప్పటివరకూ 1,203 మంది కోలుకున్నారు.
150 కోట్ల డోసుల టీకాలు..
దేశంలో కరోనా వ్యాక్సినేషన్ వేగంగా జరుగుతోంది. నిన్న ఒక్కరోజులో 90 లక్షల మందికి పైగా టీకాలు తీసుకున్నారు. దీంతో భారత్‌లో కొవిడ్ డోసుల పంపిణీ 150 కోట్ల మైలురాయికి చేరుకుందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతా వద్ద మరో 17 కోట్ల డోసులు నిల్వ ఉన్నాయి. అనుమతి లభించడంతో 15 నుంచి 18 ఏళ్ల టీనేజర్లకు కొవిడ్ టీకాలు వేస్తున్నారు.
Also Read: YSR Rythu Bharosa: రైతుల ఖాతాల్లోకి వైఎస్ఆర్ భరోసా నిధులు.. విడుదల చేసిన సీఎం జగన్
Also Read: వనమా రాఘవ ఆగడాలకు అడ్డేలేదా?... ఆది నుంచి ఆరోపణల పర్వమే...!