ఒడిశా పోలీసులు భారీ కుట్రను భగ్నం చేశారు. భద్రతా బలగాలను టార్గెట్ చేస్తూ మావోయిస్టులు ఏర్పాటు చేసిన కుట్రను ఛేదించారు. మల్కాన్‌గరి ప్రాంతంలో ఆయుధ డంప్‌ను గుర్తించారు పోలీసులు. 


మావోయిస్టుల ఏరివేతకు కొత్తగా ఏర్పాటు చేసిన కోబ్ ఘనబేడ్‌/09బీఎన్‌ కూంబింగ్ చేస్తుండగా కోరిగండి ప్రాంతంలో ఈ డంప్ కనిపించింది. ఆంధ్రప్రదేశ్‌-ఒడిశా సరిహద్దుల్లో మల్కాన్‌గిరిలోని స్వాభిమాన్‌ అంచల్‌లో ఉంది కోరిగండి గ్రామం. ఈ డంప్‌లో ఐదు IEDలు ఉన్నాయి. 


కొత్తగా ఏర్పాటు చేసిన ఘనబేడా వద్ద ఉన్న BSF టీం ఈ బాంబులను నిర్వీర్యం చేసింది.  IEDలను ధ్వంసం చేసింది. ఈ ప్రాంతంలో పనిచేస్తున్న భద్రతా దళాలే లక్ష్యంగా దీన్ని ఏర్పాటు చేసినట్టు అనుమానిస్తున్నారు పోలీసులు. 


అప్రమత్తంగా ఉన్న పోలీసులు ఎప్పటికప్పుడు మావోయిస్టు వ్యూహాలను భగ్నం చేస్తున్నారు. కూంబీంగ్ తీవ్రం చేసి కేడర్‌ను నిరుత్సాహపరుస్తున్నారు. మావోయిస్టులకు సాయం అందకుండా జాగ్రత్త పడుతున్నారు. అందుకే ప్రతీకారం తీర్చుకునేందుకు మావోయిస్టులు ఈ డంప్‌ను రెడీ చేశారు. అయితే ఎలాంటి దుర్ఘటన జరగకుండానే పోలీసులు చాకచక్యంగా డంప్‌ను గుర్తించి నిర్వీర్యం చేశారు. 


Also Read: తగాదాలు.. అక్రమ సంబంధాలు.. రామకృష్ణ మరో సెల్ఫీ వీడియో వైరల్‌



Also Read: వనమా రాఘవ అరెస్టు... హైదరాబాద్‌కు వస్తుండగా అదుపులోకి తీసుకున్న పోలీసులు


Also Read: Vanama Raghava: టీఆర్ఎస్ నుంచి వనమా రాఘవ సస్పెషన్... నాడే శిక్ష వేసి ఉంటే నేడు నాలుగు ప్రాణాలు దక్కేవి



Also Read: కొత్తగూడెం ఫ్యామిలీ సూసైడ్‌ కేసులో మరో ట్విస్టు.. తన భార్యను ఎమ్మెల్యే కుమారుడు రమ్మన్నాడని నాగ రామకృష్ణ సెల్ఫీ వీడియో 


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి