భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాగ రామకృష్ణ సంఘటనలో మరో సంచలనం. ఆత్మహత్యకు ముందు సెల్పీ వీడియో తీసుకున్న రామకృష్ణ.
ఇప్పటికే ఆత్మహత్యకు ముందు సూసైడ్ నోట్ వెలుగులోకి రావడంతో కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవపై పోలీసులు కేసు నమోదు చేశారు. రామకృష్ణ చనిపోయేముందు తీసుకున్న సెల్ఫీ వీడియో ఇప్పుడు బయటకు వచ్చింది. ఇప్పుడు ఇదే ఖమ్మంలో హాట్ టాపిక్.
తన సమస్య పరిష్కరం కావాలంటే తన భార్యను హైదరాబాద్ పంపాలని రాఘవ చెప్పినట్లు రామకృష్ణ సెల్ఫీ వీడియోలో చెప్పారు. తన అక్క, తల్లి తనపై వేధింపులకు పాల్పడ్డారని, రాఘవ తనను బెదిరించడాని రామకృష్ణ పేర్కొన్నారు.
ఇంకా సెల్ఫీ వీడియోలో నాగరామకృష్ణ ఏమన్నారంటే...."కష్టాల్లో ఉన్న నాపై మా అక్క, అమ్మ కక్ష సాధిస్తున్నారు. ఆర్థికంగా చితికిపోయిన నన్ను రోజూ వేధింపులకు గురి చేస్తున్నారు. దీనికి తోడు వనమా రాఘవరావు టార్చర్ మరింత ఎక్కువైంది. ఈ సమస్య తీరాలి అంటే నా భార్యను ఆయన పంపించాలన్నారు. అప్పటి వరకు ఈ సమస్య పరిష్కారం కాదన్నారు. ఎవరి వద్ద చెప్పుకున్నా లాభం లేదన్నారు. చెప్పిన పని చేస్తేనే ఏం కావాలో అది చేస్తారట. రాజకీయ, ఆర్థిక బలుపుతో అవతలి వ్యక్తుల బలహీనతలను గ్రహించి ఆడుకుంటున్నాాడా వ్యక్తి. ఎన్నో కుటుంబాలు ఆయన వల్ల నాశనం అయిపోయాయి. ఈ చీకటి కోణాలకు సాక్ష్యాలు లేవు. ఓ వ్యక్తి సాయం చేయాలంటే తనకు లాభమేంటని చూసుకునే వ్యక్తి రాఘవ. నా సమస్యలో నా భార్యతో లబ్ధి పొందాలనుకున్నారు. వేరే దారి లేక నా భార్య బిడ్డలను రోడ్డున పడేయలేక సూసైడ్ నిర్ణయం తీసుకున్నాం. మా నాన్న ఇచ్చిన ఆస్తిలో కొంత భాగాన్ని నాకు సహకరించి అప్లులు ఇచ్చిన వారికి చెల్లించండి. మిగిలినది అమ్మ, అక్కకు వదిలేయండి. మరొకరికి అన్యాయం జరగకుండా చూడండి. "
ఇప్పుడు ఈ ఇష్యూ రాజకీయ టర్న్ తీసుకుంది. ఎమ్మెల్యేను పార్టీ నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. రామకృష్ణ సెల్ఫీ వీడియో చూస్తుంటే అక్కడి పరిస్థితి అర్థమవుతుందని వనమా రాఘవేంద్ర దౌర్జన్యాలు తెలుస్తున్నాయని ట్వీట్ చేశారు రేవంత్. ఆయన్ని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
Also Read: Hyderabad: రెండో భర్త పోయినా బాధలేని భార్య.. ఒకేసారి మరో ఇద్దరితో అఫైర్, చివరికి..
Also Read: ఇద్దరు భర్తలు.. ఓ భార్య.. మధ్యలో ఇద్దరు పిల్లలు.. ఇది రియల్ "బతుకు జట్కాబండి" స్టోరీ !
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి