రెండు నెలల క్రితం హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో జరిగిన గుర్తుతెలియని వ్యక్తి హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. గుర్తు తెలియని వ్యక్తిని హత్య చేసి, దుప్పట్లో చుట్టి నిర్మానుష్య ప్రదేశంలో పడేసిన ఘటనను వనస్థలిపురం పోలీసులు సవాలుగా స్వీకరించారు. విచారణ చేపట్టగా కళ్లు బయర్లు కమ్మే వాస్తవాలు వెలుగు చూశాయి. నిందితులను గుర్తించి హత్యకు పాల్పడిన ఇద్ధరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. చనిపోయిన వ్యక్తి జేబులో లభించిన ఓ ఏటీఎం కార్డు నిందితులను పట్టించిందని పోలీసులు తెలిపారు. మంగళవారం వనస్థలిపురం ఎస్సై సత్యనారాయణ ఈ వివరాలు తెలిపారు.
భర్త చనిపోయిన బాధ లేకుండా మరో ఇద్దరు యువకులతో భార్య వివాహేతర సంబంధాన్ని కొనసాగించిందని పోలీసులు తెలిపారు. ఈ విషయాన్ని ప్రశ్నించినందుకు భర్త స్నేహితుడిని ప్రియుడితో కలిసి హత్య చేసిందని వెల్లడించారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా బొమ్మకల్ గ్రామానికి చెందిన కె.ప్రియాంక, అలియాస్ దీప్తి అనే 27 ఏళ్ల వివాహితకు గతంలోనే పెళ్లి కాగా, భర్తకు విడాకులు ఇచ్చింది. ఆ తర్వాత ఉదయ్ కుమార్ అనే వ్యక్తిని రెండోసారి పెళ్లి చేసుకుంది. అతను గతేడాది కరోనా సెకండ్ వేవ్‌లో చనిపోయాడు. ఆ తర్వాతి నుంచి ప్రియాంక మిర్యాలగూడలో ఇల్లు అద్దెకు తీసుకుని ఒంటరిగా ఉండేది. ఆ సమయంలో ఆమె రెండో భర్త స్నేహితుడు గుడిపాటి శ్రీనివాస్‌తో ప్రియాంకకు పరిచయం ఏర్పడింది.
మిర్యాలగూడలో ఒంటరిగా ఉంటున్న ఆమెకు ఒకరితో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఆ సంబంధం కొనసాగిస్తూనే హైదరాబాద్ ఫిలింనగర్‌కు చెందిన అలిగె సాయికుమార్ అలియాస్ రాజు అలియాస్ బేబీతో షేర్‌చాట్‌లో పరిచయం ఏర్పడి.. అది కూడా వివాహేతర సంబంధానికి దారి తీసింది. దాంతో ఆమె గతేడాది అక్టోబర్‌లో వనస్థలిపురానికి మకాం మార్చింది. గత డిసెంబర్ 10న శ్రీనివాస్ ప్రియాంక ఇంటికి రాగా, సాయికుమార్ కనిపించాడు. దీంతో ఇద్దరితో ఎలా సంబంధం కొనసాగిస్తున్నావని నిలదీశాడు. ఇరువురి మధ్య గొడవ పెరగడంతో సాయికుమార్ ఇంట్లో ఉన్న రోకలి బండతో శ్రీనివాస్ తలపై బలంగా కొట్టాడు. దీంతో చనిపోయాడు. ఈ విషయాన్ని ప్రియాంక తనతో వివాహేతర సంబంధం పెట్టుకున్న మరో వ్యక్తికి ఫోన్‌లో చెప్పింది.
అతడి సలహా మేరకు శ్రీనివాస్ మృతదేహాన్ని దుప్పట్లో మూటగట్టి అదే రోజు రాత్రి బైక్‌పై విజయపురికాలనీ బస్టాప్ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి పడేశారు. ఘటనా స్థలంలో ఎలాంటి ఆధారాలు పోలీసులకు లభించకుండా జాగ్రత్తపడ్డారు. మృతుడి జేబులో ఏటీఎం కార్డు లభించడంతో పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టి నిందితులు సాయికుమార్, ప్రియాంకలను మంగళవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
Also Read: ఇద్దరు భర్తలు.. ఓ భార్య.. మధ్యలో ఇద్దరు పిల్లలు.. ఇది రియల్ "బతుకు జట్కాబండి" స్టోరీ !