అమ్మా.. అమ్మా అంటూ పిల్లలు కాళ్లు పట్టుకున్నారు !
కన్నీళ్లతో భర్త దూరంగా నిలబడ్డాడు !
మరో భర్త మరో వైపు దూరంగా నిలబడి చూస్తున్నాడు !
ఇప్పుడు ఆ మహిళకు రెండే దారులున్నాయి. ఒకటి పిల్లతో కలిసి మొదటి భర్త వద్దకు వెళ్లడం. రెండోది ... అందర్నీ వదిలేసి రెండో భర్త వద్దకు వెళ్లడం. చాలా పిల్లలు బతిమిలాడారు. కానీ ఆమె చివరికి పిల్లల్ని మొదటి భర్తను వదిలేసి..రెండో భర్తతోనే వెళ్లాలని నిర్ణయించింది. ఈ సీన్ హైదరాబాద్ ప్రెస్ క్లబ్ వేదికగా చోటు చేుకుంది.
వరంగల్‌కు చెందిన ఓ మహిళకు ఇరవై ఏళ్ల క్రితం పెళ్లయింది. ఆమె మొదటి భర్త పేరు శశికాంత్. ఇటీవల ఆమె ఇంట్లో ఉన్న డబ్బు, దస్కం తీసుకుని వెళ్లిపోయింది. దీంతో శశికాంత్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. చివరికి పోలీసులు ఆమె హైదరాబాద్‌లో సత్యవరప్రసాద్ అనే వ్యక్తితో కలిసి జీవిస్తోందని తెలుసుకుని పట్టుకుని జైలుకు పంపారు. ఆమె బెయిల్‌పై బయటకు వచ్చిన తర్వాత తనపై మొదటి భర్త చేసిన ఆరోపణలు అన్నీ అబద్దమని... చెప్పేందుకు ప్రెస్‌క్లబ్‌లో ప్రెస్మీట్ పెట్టింది. ఈ ప్రెస్‌మీట్‌కు మొదటి భర్త.. పిల్లలు కూడా వచ్చారు. ఆ పిల్లలు తన పిల్లలు కాదని.. తన పిల్లలు అయితే పోలీస్ స్టేషన్‌లో తనను టార్చర్ పెడుతున్నప్పుడు ఎందుకు రాలేదని ఆమె ప్రశ్నించారు. ఆ పిల్లలు తన అక్క పిల్లలని.. ఆమె చనిపోతే... తను పెంచానని చెబుతోంది. అయితే ఆ పిల్లలు మాత్రం తమ అమ్మేనని.. ఇంటికి రావాలని వేడుకున్నారు. కానీ ఆమె మనసు కరగలేదు.
ఇంట్లో ఉన్నదంతా ఊడ్చుకుని ఆమె ఫేస్‌బుక్‌లో పరిచయమైన సత్యవరప్రసాద్‌తో కలిసి జీవించాడనికి వెళ్లిపోయింది. అతను తూ.గో జిల్లాకు చెందిన వ్యక్తి. అతనితో కలిసి ఆ జిల్లాలో జరిగిన ఓ సామూహిక వివాహ కార్యక్రమాల్లో వారిద్దరూ పెళ్లి కూడా చేసుకున్నారు. తర్వాత హైదరాబాద్ వచ్చి కాపురం పెట్టారు. కానీ పోలీసులకు చిక్కిపోయారు. అయితే ఇప్పుడు కూడా ఆమె పిల్లలు,మొదటి భర్త వద్దని డిసైడయింది ., రెండో భర్తతోనే ఉండాలని నిర్ణయించుకుంది. దీంతో ఆ పిల్లలను తోసేసి తన దోవన తాను వెళ్లిపోయింది. అక్కడున్న వారందరికీ బతుకు జట్కాబండి కార్యక్రమం లైవ్‌లో కనిపించినట్లయింది.