ఖమ్మం జిల్లాలో ఓ పావురం అత్యంత అనుమానాస్పద రీతిలో స్థానికులకు కనిపించింది. ఖమ్మం జిల్లాలోని తిరు మలాయపాలెం మండలం దమ్మాయిగూడెంలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ధాన్యం కొనుగోలు కేంద్రం సమీపానికి వచ్చిన పావురం ఎటూ కదలకుండా అక్కడే ఉండిపోయింది. దాని కాలుకి లేత పసుపు రంగులో సింథటిక్‌ ట్యాగ్‌ ఉండడం విపరీతమైన అనుమానాలకు, ఊహాగానాలకు తావిస్తోంది. బత్తుల నాగేశ్వరరావు అనే వ్యక్తి.. ఇది గమనించి సర్పంచ్‌ నాగేశ్వర్‌రావు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. 


ఆ ట్యాగ్‌ను పోలీసు అధికారులు, స్థానికులు పరిశీలించగా.. ఆ ట్యాగ్‌పై చైనా భాషను పోలిన అక్షరాలు ఉండడంతో అందరూ ఆందోళన చెందారు. దీంతో ఎస్సై భవాని చేరుకుని పావురాన్ని స్వాధీనం చేసుకుని అటవీ శాఖ అధికారులకు అప్పగించారు. దీనిపై ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్‌ను విలేకరులు సంప్రదించగా.. చైనా నుంచి ఇంత దూరం పావురం వచ్చే అవకాశమే లేదని తెలిపారు. దీనిపై విచారణ చేసి మరిన్ని వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. కదల్లేని స్థితిలో ఉన్న పావురానికి చికిత్స అందించి పూర్తి వివరాలను వెల్లడిస్తామని చెప్పారు. అయితే, ఒడిశా రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లోనూ సోమ, మంగళవారాల్లో చైనా భాష ట్యాగ్‌తో ఉన్న పావురాలు కనిపించాయి. 


ఇటీవలే ప్రకాశం జిల్లా చీమకుర్తిలోనూ అదే తరహా పావురం స్థానికులకు చిక్కింది. ఆ పావురం కాలికి పసుపు రంగు ట్యాగ్‌ ఉండటంపై పలు సందేహాలు కలుగుతున్నాయి. వారం రోజులుగా ఈ పావురం కనిపిస్తోందని.. ఉన్నతాధికారులకు ఈ సమాచారం అందించామంటున్నారు స్థానిక పోలీసులు. ఈ ఘటనపై చర్చ జరుగుతుండగానే ఖమ్మం జిల్లాలో ఇలాంటి ఘటన వెలుగుచూసింది. అసలే సరిహద్దులో చైనా కుట్రలు పన్నుతున్న వేళ.. ఈ పావురాలు ఈ స్థితిలో కనిపించడం మరింత అనుమానాలకు ఊతమిస్తున్నాయి. అవి ఏ దేశపు పావురాలు? వీటి కాలికున్న ట్యాగ్‌లు ఏం చాటుతున్నాయి? ఇవేమైనా గూఢాచారి పావురాలా? అని పోలీసులు ఆరా తీస్తున్నారు. వీటి వెనుక కుట్ర ఏమైనా ఉందా అన్న కోణంలో విచారణ జరుపుతున్నారు.


Also Read: ఆర్జీవీ ట్విట్టర్ కౌంటర్స్.. ఇక కలిసే మాట్లాడుకుందామని చెప్పిన మంత్రి పేర్ని నాని.. కానీ..


Also Read: RGV: 'ఇండస్ట్రీ పెద్ద దిక్కుగా ఉండాలనుకోవడం మూర్ఖత్వం.. ' స్పందించిన వర్మ.. 


Also Read: RGV Vs Perni Nani: ఆర్జీవీ 10 ప్రశ్నలకు మంత్రి పేర్ని నాని కౌంటర్.. ‘ఆ ఫార్ములా ఏంటి వర్మగారూ’ అంటూ వరుస ట్వీట్లు


Also Read: RGV: పవన్ సినిమాకి సంపూ సినిమాకి తేడా లేనప్పుడు మీ ప్రభుత్వంలో మంత్రికి డ్రైవర్‌కి కూడా తేడా లేదా? ఆర్జీవీ స్ట్రాంగ్‌ కౌంటర్


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి