కొన్ని రోజులుగా సినీ పరిశ్రమకు పెద్ద దిక్కు ఎవరనే విషయం హాట్ టాపిక్ గా మారింది. దాసరి తరువాత ఆ స్థానంలో కూర్చొనే హక్కు మెగాస్టార్ కి ఉందంటూ కొందరు ప్రముఖులు అన్నారు. అదే సమయంలో ఇండస్ట్రీ పెద్ద దిక్కుగా మోహన్ బాబు ఉండాలంటూ సీనియర్ నటుడు నరేష్ లాంటి వాళ్లు కామెంట్స్ చేశారు. తాజాగా ఈ విషయంపై స్పందించిన చిరు.. తనకు ఇండస్ట్రీ పెద్ద అనిపించుకోవడం ఇష్టం లేదని క్లారిటీగా చెప్పేశారు. 


ఎవరికైనా సాయం చేయాలంటే ముందుకొస్తాను కానీ.. ఇద్దరు గొడవ పడితే దాన్ని పరిష్కరించడానికి మాత్రం ముందుకు రానని తేల్చి చెప్పారు చిరంజీవి. ఇదిలా ఉండగా.. 'ఆర్ఎక్స్ 100' దర్శకుడు అజయ్ భూపతి తన గురువు రామ్ గోపాల్ వర్మను ఇండస్ట్రీ పెద్దగా ఉండాలంటూ ట్వీట్ పెట్టారు. 'మా బాస్ రామ్ గోపాల్ వర్మని ఇండస్ట్రీ పెద్ద దిక్కుగా చూడాలనేది నా కోరిక. సామీ మీరు రావాలి సామీ' అంటూ ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు. ఈ ట్వీట్ చూసిన చాలా మంది అజయ్ భూపతిని ట్రోల్ చేశారు. 


తాజాగా అజయ్ పెట్టిన ట్వీట్ పై స్పందించిన వర్మ.. 'అజయ్ గారూ.. ఇండస్ట్రీ వాళ్ళకి పెద్ద దిక్కు ఉండాలనుకోవడం మూర్ఖత్వం..ఎందుకంటే, ఇండస్ట్రీ లో ఉన్న ప్రతి వాడికీ వేరే వేరే స్వార్థాలు ఉంటాయి.. దాని మూలాన వాడికి మాత్రమే పనికొచ్చే మాటే ప్రతివాడు వింటాడు కానీ.. ఎవడికో పెద్దదిక్కు అని టైటిల్ ఇచ్చినంత మాత్రాన వాడి మాట ఎవ్వడూ వినడు' అంటూ బదులిచ్చారు. 


దీనిపై నెటిజన్లు వెటకారంగా కామెంట్స్ చేస్తున్నారు. ఓ నెటిజన్ అయితే 'ఒక పని చెయ్ 'పెద్ద దిక్కు' అని టైటిల్ పెట్టి ఇండస్ట్రీలో లోలోపల జరుగుతున్న గొడవల ఆధారంగా ఒక సినిమా తెసేయ్' అంటూ సలహా ఇచ్చాడు. 






Also Read: 'స్పిరిట్' సినిమాలో ప్రభాస్ రోల్ ఇదే.. రివీల్ చేసిన నిర్మాత..


Also Read: సంక్రాంతి రేసులో డబ్బింగ్ సినిమాలు.. అజిత్ Vs విశాల్..


Also Read: ఇది చాలా టఫ్ టైం.. 'రాధేశ్యామ్' దర్శకుడు హింట్ ఇస్తున్నాడా..?


Also Read: ఇప్పుడు నోళ్లు మూసుకుంటే ఇంకెప్పటికీ తెరవలేరు.. వర్మ ఫైర్..


Also Read: రాజమౌళితో కరణ్ జోహార్ ప్లాన్.. వర్కవుట్ అవుతుందా..?


Also Read: బాధలో దీప్తి సునయన.. చిల్ అవుతోన్న సిరి, షణ్ముఖ్..




ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి