ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపెవరిది? అత్యధిక అసెంబ్లీ స్థానాలు కలిగిన రాష్ట్రంలో మరోసారి కాషాయ జెండా రెపరెపలాడుతుందా? లేక భాజపాకు ఝలక్ ఇచ్చి సమాజ్‌వాదీ పార్టీ విజయఢంకా మోగిస్తుందా? తమ రాష్ట్రానికి ఎవరు సీఎంగా ఉంటే బాగుంటుందని యూపీ ప్రజలు కోరుకుంటున్నారు? వీటన్నింటికి సమాధానం వెతికే పనిలో ABP న్యూస్ ఉంది. తాజాగా విడుదలైన ABP న్యూస్ సీ-ఓటర్ సర్వేలో ఏముందో మీరే చూడండి.


క్షణక్షణానికి..


ఎన్నికలు దగ్గర పడుతోన్న కొద్ది ప్రజల మూడ్ కూడా అలానే మారుతోంది. ABP న్యూస్ చేస్తోన్న వరుస సర్వేల్లో ఈ విషయం అర్థమవుతోంది. క్షణాక్షణానికి మారుతోన్న సమీకరణాలతో యూపీ రాజకీయం మరింత వేడెక్కుతోంది. అయితే తాజాగా ఉత్తర్‌ప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా ప్రజల ఓటు ఎవరికి అనే విషయంపై సర్వే చేసింది ABP.


మునుపటి సర్వేతో పోలిస్తే సీఎం ఎవరనేదానిపై వచ్చిన ఓట్లలో యోగి ఆదిత్యనాథ్, అఖిలేశ్ యాదవ్‌కు మధ్య ఉన్న వ్యత్యాసం కాస్త పెరిగింది. యోగి ఆదిత్యనాథ్‌ వైపే అత్యధిక మంది మొగ్గు చూపారు.


యూపీ సీఎంగా తమ మొదటి ఎంపిక యోగి ఆదిత్యనాథేనని 44 శాతం మంది ప్రజలు తెలిపినట్లు సర్వేలో తేలింది. అఖిలేశ్ యాదవ్ సీఎం కావాలని 32 శాతం మంది కోరుకోగా.. 15 శాతం మంది మాయావతికి ఓటు వేశారు.


యూపీ సీఎంగా తొలి ప్రాధాన్యత ఎవరికి?


9DEC- 13DEC- 20DEC- 27DEC- Jan 3


యోగి ఆదిత్యనాథ్


45%  –   41%  –   42%  –    42%  –   44%


అఖిలేశ్ యాదవ్ 


31    -    34%  –   35%  –    35%  –   32%


మాయావతి


15    -   14%  –    14%  –    15%  –   15%


ఎంత మార్పు వచ్చింది?


డిసెంబర్ 27న చేసిన సర్వేకు ఇప్పటికీ ప్రజల్లో మార్పు వచ్చింది. గత సర్వేలో 42.4 శాతం మంది ప్రజలు యూపీ సీఎంగా తమ తొలి ప్రాధ్యాన్యత యోగి ఆదిత్యనాథ్ అని చెప్పారు. ఇప్పుడు అది 44.4 శాతానికి పెరిగింది. అఖిలేశ్ యాదవ్ విషయంలో ఈ శాతం తగ్గింది. గత సర్వేలో 34.6 శాతం మంది ప్రజలు యూపీ సీఎంగా అఖిలేశ్ యాదవ్‌కు తొలి ప్రాధాన్యతను ఇవ్వగా తాదా సర్వేలో ఇది 32.5 శాతానికి పడిపోయింది.


                              27 డిసెంబర్ – ప్రస్తుతం


యోగి ఆదిత్యనాథ్ –    42.4%       –    44.4%
అఖిలేశ్ యాదవ్   –    34.6%       –    32.5%


Also Read: Guruvayur Temple: భక్తులారా ఇదేమైనా న్యాయమా..? పనికిరావని హుండీలో వేస్తారా?




Also Read: India's Omicron Cases: ఈ దేశానికి ఏమైంది? ఓవైపు ఒమిక్రాన్.. మరోవైపు కరోనా.. కొత్తగా 37 వేల కేసులు


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి