UP Election 2022: 'నా వల్లే రామరాజ్యం.. కావాలంటే నా కలలోకి వచ్చిన కృష్ణుడిని అడగండి'

ABP Desam   |  Murali Krishna   |  28 Jan 2022 04:37 PM (IST)

తనకు ప్రతిరోజు రాత్రి కల్లోకి కృష్ణుడు వస్తున్నాడని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ అన్నారు.

అఖిలేశ్ యాదవ్

ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పార్టీలన్నీ ప్రచారం చేస్తున్నాయి. ముఖ్యంగా భాజపాను గద్దె దిచ్చేందుకు సమాజ్‌వాదీ పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇప్పటికే ప్రచార సభల్లో తనదైన శైలిలో పంచులు, విమర్శలతో ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ చెలరేగిపోతున్నారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. 

శ్రీ కృష్ణ భగవానుడు ప్రతి రోజు రాత్రి నా కల్లోకి వచ్చి నేను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానని చెబుతున్నాడు. సమాజ్‌వాదీ పార్టీ ద్వారానే రామరాజ్యం స్థాపితమవుతుందని నాకు కృష్ణుడు చెప్పాడు.                                  - అఖిలేశ్ యాదవ్, సమాజ్‌వాదీ పార్టీ అధినేత

భాజపాకు చెందిన నాన్‌పారా ఎమ్మెల్యే మాధురి వర్మ ఎస్పీ పార్టీలో చేరిన సందర్భంగా ఏర్పాటు చేసిన మీటింగ్‌లో అఖిలేశ్ ఈ వ్యాఖ్యలు చేశారు. సీఎం యోగి ఆదిత్యనాథ్.. మథుర నుంచి పోటీ చేస్తారనే వార్తలు వినిపిస్తోన్న వేళ అఖిలేశ్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. తాము అధికారంలోకి వస్తే 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తామని ఇచ్చిన హామీతో భాజపా మైండ్ బ్లాక్ అయిందని అఖిలేశ్ అన్నారు.

గట్టిపోటీ..

Published at: 04 Jan 2022 12:41 PM (IST)
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.