టికెట్ రేట్స్ ఇష్యూ మీద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు. ఓ టీవీ ఛానల్ డిబేట్‌లో ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానితో టికెట్ రేట్స్ విషయంలో ప్రభుత్వ జోక్యం ఉండకూడదని చెప్పారు. ఇక అప్పటి నుంచి టికెట్స్ రేట్లపై ప్రభుత్వాన్ని ప్రశ్నించడం మెుదలుపెట్టారు ఆర్జీవీ. పేర్ని నానికి కొన్ని ప్రశ్నలు కూడా సంధించారు. ప్రభుత్వాన్ని ఎవరైనా తప్పుదారి పట్టిస్తున్నారా? అంటూనే... ప్రభుత్వ విధానాలను ప్రశ్నించారు రామ్ గోపాల్ వర్మ.


అయితే ఆర్జీవీ ట్విట్లతో మంత్రి పేర్ని నాని కూడా ట్విట్టర్ వేదికగా సమాధానాలు ఇస్తూ వచ్చారు. ఈ మేరకు వరుస ట్వీట్లు చేశారు. టికెట్ల వ్యవహారం ఇంకా సద్దుమణగలేదు. ప్రభుత్వం, దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ మధ్య వివాదం మరింత రాజుకుంటోంది. ప్రశ్నలతో ప్రభుత్వాన్ని ఆర్జీవీ నిలదీస్తుంటే... రివర్స్‌ అటాక్‌తో మంత్రి పేర్ని నాని విరుచుకు పడ్డారు. గత మూడు రోజులుగా వీళ్ల మధ్య వార్ నడుస్తోంది.


అయితే తాజాగా.. ఆర్జీవీ ట్విట్ చేశారు. మీరు అనుమతిస్తే.. నేను మిమ్మల్ని కలిసి మా తరఫున, మాకు ఉన్న సమస్యలు ఏంటని.. వివరణ ఇస్తానని చెప్పారు. అది విన్న తర్వాత ప్రభుత్వ పరంగా ఆలోచించి సరైన  పరిష్కారం ఇస్తారని ఆశిస్తున్నట్టు ట్వీట్ చేశారు.





 


ఆర్జీవీ చేసిన ట్వీట్ పై మంత్రి పేర్ని నాని స్పందించారు. ధన్యవాదాలు తెలుపుతూ.. తప్పకుండా త్వరలో కలుద్దామని చెప్పారు. కానీ.. వీళ్లిద్దరూ ఎప్పుడు కలుస్తారా? అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆర్జీవీ, పేర్ని నాని నడుమ చర్చ అనంతరం ఏం తేలుస్తారోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.






అంతకు ముందు ఆర్జీవీ ఓ ట్వీట్ చేశారు. "నేనడిగే ముఖ్య ప్రశ్న టికెట్ ధర నిర్ణయించటానికి ప్రభుత్వం ఎవరని? పవన్ కళ్యాణ్ సినిమాకి సంపూర్ణేష్ బాబు సినిమాకి మీ ప్రభుత్వం లో తేడా లేనప్పుడు మంత్రిగా మీకు మీ డ్రైవర్ కి కూడా తేడా లేదా?" అని ప్రశ్నించారు.


 






Also Read: RGV Questions AP Govt: వర్మ వదలడం లేదుగా... ఏపీ ప్రభుత్వానికి ఆర్జీవీ సంధించిన తాజా ప్రశ్నలు!


Also Read: RGV: 'ఇండస్ట్రీ పెద్ద దిక్కుగా ఉండాలనుకోవడం మూర్ఖత్వం.. ' స్పందించిన వర్మ.. 


Also Read: RGV Vs Perni Nani: ఆర్జీవీ 10 ప్రశ్నలకు మంత్రి పేర్ని నాని కౌంటర్.. ‘ఆ ఫార్ములా ఏంటి వర్మగారూ’ అంటూ వరుస ట్వీట్లు


Also Read: RGV: పవన్ సినిమాకి సంపూ సినిమాకి తేడా లేనప్పుడు మీ ప్రభుత్వంలో మంత్రికి డ్రైవర్‌కి కూడా తేడా లేదా? ఆర్జీవీ స్ట్రాంగ్‌ కౌంటర్