టికెట్ రేట్స్ ఇష్యూ (Movie Ticket Rates Issue) మీద సంచలన దర్శకులు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) తన అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు. ఓ టీవీ ఛానల్ డిబేట్‌లో ఏపీ సినిమాటోగ్ర‌ఫీ మంత్రి పేర్ని నాని (Perni Nani)తో టికెట్ రేట్స్ విషయంలో ప్రభుత్వ జోక్యం ఉండకూడదని చెప్పారు. ఈ రోజు ట్విట్టర్ వేదికగా పేర్ని నానికి కొన్ని ప్రశ్నలు సంధించారు. లేటెస్టుగా యూట్యూబ్ ద్వారా మరో పది ప్రశ్నలు సంధించారు. అందులో ఆల్రెడీ ట్విట్ట‌ర్‌లో అడిగినవి కొన్ని ఉన్నాయి. కొత్తవి ఇంకొన్ని ఉన్నాయి. ప్రభుత్వాన్ని ఎవరైనా తప్పుదారి పట్టిస్తున్నారా? అంటూనే... ప్రభుత్వ విధానాలను ప్రశ్నించారు.


1. తయారీదారుడికి (నిర్మాత), వినియోగగదారుడికి (ప్రేక్షకుడు) మధ్య ప్రయివేట్ ట్రాన్స్‌శాక్ష‌న్‌లో ప్రభుత్వానికి ఏం పని? కొన్ని పరిస్థితులు ఏర్పడినప్పుడు తయారీదారుడిని, వినియోగదారుడిని కాపాడటం కోసం ప్రభుత్వం జోక్యం చేసుకుంటుంది. ధరలు నియంత్రిస్తుంది. అటువంటి పరిస్థితి సినిమా ఇండస్ట్రీలో ఎక్కడ వచ్చింది? ఒక్కసారి దయచేసి చెబుతారా?


2. సినిమా అవ్వచ్చు, ఏదైనా ప్రోడక్ట్ అవ్వచ్చు - ఎవరైనా ప్రొడ్యూస్ చేసినప్పుడు, ప్రోడక్ట్ తయారీకి అయిన ఖర్చును కన్సిడర్ చేయకుండా, ఏ ఉద్దేశంతో తీశారో అది పట్టించుకోకుండా... సంబంధం లేకుండా నియంత్రించాలని అనుకున్నప్పుడు ప్రొడ్యూస్ చేసేవాళ్లకు మోటివేషన్ పోతుంది. అంతే వస్తుందని క్వాలిటీలో కాంప్రమైజ్ అవుతారు. తక్కువ క్వాలిటీ ప్రోడక్ట్ వస్తుంది. దీనికి మీరు ఏ విధంగా జస్టిఫికేషన్ ఇస్తారు?


3. పేదలకు, ప్రజలకు సినిమా అనేది నిత్యావసరం అని అనుకున్నప్పుడు... పేదలకు హెల్ప్ చేయాలనే ఉద్దేశం మీకు ఉన్నప్పుడు సినిమాకు కూడా సబ్సిడీ ఇవ్వవొచ్చు కదా! కాలేజీ ఫీజులు, మెడికల్ ఫీజుల్లో రాయితీలు కల్పించినట్టు... ప్రభుత్వం జేబులోంచి డబ్బులు తీసి నిర్మాతకు ఇచ్చి రాయితీ ఇవ్వవచ్చు కదా? ఎందుకంటే... సినిమా నిత్యావసరం అని మేం అనడం లేదు. మీరు (ఏపీ ప్రభుత్వంలో పెద్దలు) అంటున్నారు.


4. రేషన్ షాపుల్లో ప్రజలకు నిత్యావసరాలు తక్కువ ధరకు ఇస్తారు. అలా  మేం అడిగిన రేటుకు మా సినిమాలను మీరే కొనుక్కుని... రేషన్ థియేటర్స్ అని కొత్తగా స్టార్ట్ చేసి లేదా థియేటర్లను తీసుకుని, వాటిని రేషన్ థియేటర్స్ అని చేసి వాటి ద్వారా మీరు ప్రజలకు సేవ చేయవచ్చు కదా?


5. ప్రొడ్యూసర్స్ ఏవైతే కోరుకుంటున్నారో? ఇండస్ట్రీ ఏం కోరుకుంటోందో? ఆ టికెట్ రేటు పెట్టి మీరు కొని లేదంటే కొన్ని టికెట్స్ మీరు కొని, ఇంకా తక్కువ ధరకు మీరు ప్రజలకు ఇచ్చారనుకోండి... అప్పుడు మాకు మా డబ్బులు వస్తాయి. మీకు మీ ఓట్లు వస్తాయి. ఇది ఎలా ఉంది?


6. ఇప్పుడు మీలో (ప్రభుత్వంలో) కొందరు సినిమా వ్యయం గురించి మాట్లాడుతున్నారు. సినిమా మేకింగ్‌లో, బ‌డ్జెట్‌లో అందరి రెమ్యూనరేషన్స్ ఉంటాయి. అన్ని కలిపినప్పుడే వ్యయం అంటారు. వ్యయం, రెమ్యూనరేషన్స్ డిఫరెంట్ కాదు. ఇదొక పాటింట్. రెండో పాయింట్ ఏంటంటే... పవన్ కల్యాణ్, మహేష్ బాబు, బన్నీని చూసి సినిమాకు వస్తారు. మేజర్ రెవెన్యూ వచ్చేది పెద్ద సినిమాలకు, హీరోల సినిమాలకు! హీరోలను చూసి ప్రేక్షకులు వస్తారు కనుక, వాళ్లకు అంతకు ముందున్న ట్రాక్ రికార్డు చూసి నిర్మాతలు కోట్లు ఇస్తారు. అంతే కానీ, మతి మారి కాదు. అది బిజినెస్ కాలిక్యులేషన్. అంతకంటే ఏమీ లేదు. 50 కోట్ల రూపాయాలు ఎందుకు? పది కోట్లు చాలని చెప్పడానికి వేరేవాళ్లకు హక్కు ఎలా ఉంటుంది? హీరోలు ఎక్కువ ఇస్తున్నారనేది హాస్యాస్పదం. మీకు ఇన్ఫర్మేషన్ తెలియకా? లేదంటే మీకు అర్థం కావడం లేదా? మాకు అర్థం అయ్యేటట్టు చెప్పండి!
Also Read: Online Fraud: హీరోయిన్‌కు టోక‌రా... మోస‌పోయానంటూ పోస్ట్
7.
'ప్రోమో చాలా బావుంటుంది. సినిమా బాగోదు' అని అంటున్నారు. మీరు టమాటో తీసుకొచ్చి సగం తిని, బాలేదని చెబితే... ఫైవ్ స్టార్ హోట‌ల్‌కు వెళ్లి బాగా తినేసి బాలేద‌ని  బిల్లు క‌ట్ట‌న‌ని చెబితే... అది కరెక్టా? అధికారంలోకి వచ్చిన తర్వాత అది చేస్తామని, ఇది చేస్తామని చెప్పిన తర్వాత నాకు చెప్పినవి జరగడం లేదని అధికారం నుంచి దిగిపోమంటే దిగిపోతారా?


8. నాది ఒక చిన్న సలహా... డీడీ (దూరదర్శన్) 1, డీడీ 2 ఉన్నాయి. బాహుబలి బాబుల్లాంటి సినిమాలు తీయొచ్చు కదా? ప్రజానీకానికి తక్కువ రేటులో వినోదం పంచొచ్చు కదా?
Also Read: అక్కడ ఆస్పత్రిలో హార్ట్ ఎటాక్‌తో తల్లి... ఇక్కడ ఇండియాలో కేసుల్లో చిక్కుకున్న హీరోయిన్!
9.
పెద్ద సినిమా, చిన్న సినిమా అని మాట్లాడుతున్నారు. చిన్న సినిమాకు 20, 30 మంది పని చేయవచ్చు. పెద్ద సినిమాకు 1000 మంది పని చేయవచ్చు. ఖర్చు పెట్టె డబ్బు వెయ్యి మంది దగ్గరకు వెళ్తున్నాయి. వ్యయానికి ఉన్న వ్యతాసం అక్కడ వస్తుంది.


10. హీరో, నిర్మాత టికెట్ రేటు ఎక్కువ పెట్టి దోచుకుంటున్నారని, టికెట్ ధరలు నియంత్రించాలని అనుకుంటే...  సినిమాకు మాత్రమే ఎందుకు? ఫుడ్‌కు ఎందుకు ఉండ‌కూడ‌దు? ఫైవ్ స్టార్ హోట‌ల్‌లో ఫుడ్ వెయ్యి ఉండొచ్చు. అది ఐదు రూపాయలకు పేదోడికి అమ్మాలనేది సరైన వాదన కానప్పుడు... టికెట్ రేట్స్ తగ్గించడం ఎలా సరైన పాయింట్ అవుతుంది?
Also Read: ఇప్పుడు నోళ్లు మూసుకుంటే ఇంకెప్పటికీ తెరవలేరు.. వర్మ ఫైర్..
చివరగా... ఈ నిర్ణయాలు (టికెట్ రేట్స్ మీద) తీసుకునేవాళ్లకు సినిమా ఇండస్ట్రీ ఎలా పని చేస్తుందనేది తెలుసా? ఎవరైనా తప్పుదోవ పట్టిస్తున్నారా? మనసు విప్పి నా అభిప్రాయాలు చెప్పాను. ఇండస్ట్రీలో కొంత మంది తమ అభిప్రాయాలు చెప్పవచ్చు. దానికి పాయింట్ బై పాయింట్ క్లియ‌ర్ క‌ట్‌గా మీ దగ్గర సమాధానాలు ఉంటే... ఇస్తే... మాకు, మీకు క్లారిటీ ఉంటుంది.  


Also Read: 'రాధే శ్యామ్'ను డైరెక్టుగా ఓటీటీలో విడుదల చేస్తారా? ఆడియ‌న్స్‌ను మోసం చేయ‌డ‌మేనా?
Also Read: ఖరీదైన ఆడి కారు కొన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్... అంత రేటు పెట్టి కొన్నారా?
Also Read: గతం గురించి కామెంట్... సమంత మాటల్లో చాలా మీనింగ్ ఉందిగా!
Also Read: 'ఆల్రెడీ ఢీ మానేశాను. ఇంకేం మానాలిరా బాబూ!' - 'సుడిగాలి' సుధీర్ సెల్ఫ్ సెటైర్... అన‌సూయ ఈజ్ బ్యాక్‌!
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి