సమంత మాటల్లో ఈ మధ్య ఫిలాసఫీ వినబడుతోంది. సోషల్ మీడియాలో ఆమె చేసే పోస్టుల్లో కనబడుతోంది. గతంలో కూడా సమంత ఫిలాసఫీ మాట్లాడి ఉండవచ్చు. కానీ, అప్పుడు ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. అక్కినేని నాగ చైతన్య విడాకుల తర్వాత సమంత ఏం చేసినా... ఏం మాట్లాడినా... ప్రేక్షక లోకం అంతా నిశితంగా గమనిస్తూ, అందులో లోతైన అర్థం ఏదైనా ఉందేమోనని వెతుకుతోంది. అప్పటికీ, ఇప్పటికీ సమంత వ్యక్తిగత జీవితంలో వచ్చిన మార్పు ఆమెను చాలా  ప్రత్యేకంగా చూసేలా చేస్తోంది. విడాకులకు ముందు 'మామ్ సెడ్' (అమ్మ చెప్పింది) అంటూ సమంత చాలా సూక్తులు పోస్ట్ చేశారు. లేటెస్టుగా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఓ పోస్ట్ చేశారు. అందులో గతం గురించి కామెంట్ చేశారు.


"I've never met a strong person with an easy past" - ఇదీ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో సమంత పోస్ట్ చేసిన కోట్. "సులభమైన గతం ఉన్న బలమైన వ్యక్తిని నేను ఎప్పుడూ కలవలేదు" అని ఆమె చెప్పారు. గతం చాలా సులభంగా ఉంటే... ఆ వ్యక్తులు శక్తివంతంగా, బలంగా మారలేరని దాని మీనింగ్. గత ఏడాది సమంత జీవితంలో ఏం జరిగిందీ? గత ఏడాది ఆమె గతం ఏమిటన్నదీ? ప్రేక్షకులు అందరికీ తెలుసు. ఆ గతం ఎంతో కఠినంగా ఉంది కాబట్టే తాను శక్తిమంతంగా మారుతున్నట్టు సమంత చెప్పాలని అనుకుంటున్నారా? అవునని కొందరు నెటిజన్స్ అంటున్నారు. అదీ సంగతి!


ఇక, సినిమాలకు వస్తే... సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న 'యశోద' ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయ్యింది. త్వరలో సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ కానుంది. అలాగే, గుణశేఖర్ దర్శకత్వంలో ఆమె నటించిన 'శాకుంతలం' చిత్రీకరణ పూర్తి అయ్యింది. ఈ ఏడాది ఆ సినిమా విడుదల కానుంది. ఎస్.ఆర్. ప్రభు, ఎస్.ఆర్. శేఖర్ నిర్మాణంలో మరో తెలుగు, తమిళ సినిమా అంగీకరించారు.
Also Read: 'ఆల్రెడీ ఢీ మానేశాను. ఇంకేం మానాలిరా బాబూ!' - 'సుడిగాలి' సుధీర్ సెల్ఫ్ సెటైర్... అన‌సూయ ఈజ్ బ్యాక్‌!
Also Read: బాసూ... క్లాస్‌గా మెగాస్టార్ మాస్ స్టెప్పేస్తే? ఫుల్ సాంగ్ వచ్చేసింది... చూశారా?
Also Read: 'రాధే శ్యామ్' నిర్మాతలకు కొత్త తలనొప్పి... రోజుకు ఓసారి ఆ మాట చెప్పాల్సిందేనా?
Also Read: త్రివిక్రమ్ క్లాప్‌తో సినిమా మొదలు... బుధవారం నుంచి క్లాసులు!
Also Read: కృష్ణుడే సత్యభామ కాళ్లు పట్టుకున్నాడు... బాలకృషుడు ఓ లెక్కా!?
Also Read: లెఫ్ట్ హ్యాండ్ రెడీ.. వాళ్లు ఎదురుపడితే దబిడిదిబిడే.. వార్నింగ్ ఇచ్చిన బాలయ్య..
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి