వన్‌ప్లస్ 10 ప్రో ఫస్ట్ లుక్‌ను కంపెనీ సహ వ్యవస్థాపకుడు పీట్ లా షేర్ చేశారు. ఈ టీజర్ ఇమేజ్ ప్రకారం.. ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు ఉండనున్నాయి. ఈ కెమెరాల తయారీలో కూడా హజిల్‌బ్లాడ్ భాగస్వామ్యం ఉంది. ఈ స్వీడిష్ ఫొటోగ్రఫీ సంస్థతో వన్‌ప్లస్ తన భాగస్వామ్యాన్ని కొనసాగిస్తుంది.
ఈ ఫోన్‌కు సంబంధించిన చిన్న వీడియో క్లిప్‌ను కూడా కంపెనీ షేర్ చేసింది. ఇందులో ఈ ఫోన్ రెండు కలర్ ఆప్షన్లలో చూడవచ్చు. దీనికి సంబంధించిన ప్రీ-రిజిస్ట్రేషన్ లిస్టింగ్ ప్రకారం.. ఈ ఫోన్ చైనాలో జనవరి 11వ తేదీన లాంచ్ కానుంది.
“a refreshed new OnePlus x Hasselblad camera module” అని వన్‌ప్లస్ సహ వ్యవస్థాపకుడు పీట్ లా ట్వీట్ చేశారు. ఈ ఫోన్‌లో వెనకవైపు మూడు కెమెరాలు ఉండనున్నాయని గతంలో కొన్ని లీకులు వచ్చాయి. అయితే ఆ లీకులు నిజమేనని నేటి అధికారిక ఫొటోతో ప్రూవ్ అయింది. పూర్తి ఫ్లాగ్‌షిప్ అనుభవాన్ని అందించడానికి వన్‌ప్లస్ 10 ప్రోకి చాలా అప్‌గ్రేడ్లు చేశామని పీట్ లా తెలిపారు.
ఫోన్ వెనకవైపు చదరపు ఆకారంలో కెమెరా సెటప్‌ను చూడవచ్చు. ఇందులో మొత్తం నాలుగు కటౌట్లు ఉన్నాయి. వీటిలో మూడు కెమెరాలు కాగా.. ఒకటి ఎల్ఈడీ ఫ్లాష్. ఫోన్ వెనక ఎడమవైపు పైభాగంలో ఈ కెమెరా మాడ్యూల్‌ను చూడవచ్చు. వొల్కానిక్ బ్లాక్, ఎమరాల్డ్ ఫారెస్ట్ రంగుల్లో ఈ ఫోన్ లాంచ్ చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది.
వన్‌ప్లస్ 10 ప్రో ప్రీ-ఆర్డర్లు చైనాలో ఇప్పటికే ప్రారంభం అయ్యాయి. ఒప్పో స్టోర్, జేడీ.కాం, టీమాల్ వెబ్ సైట్లలో ఈ ఫోన్ లిస్ట్ అయింది. జనవరి 11వ తేదీన ఉదయం 11:30 గంటలకు ఈ ఫోన్ లాంచ్ ఈవెంట్ జరగనుంది. 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్, 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్, 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ కూడా ఇందులో ఉన్నాయి.
వన్‌ప్లస్ 10 ప్రో స్పెసిఫికేషన్లు (అంచనా)
ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఆక్సిజన్ఓఎస్ 12 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 6.7 అంగుళాల క్యూహెచ్‌డీ+ డిస్‌ప్లే ఉండనుంది. ఎల్టీపీవో 2.0 ఫీచర్ ఉండనుందని కంపెనీ ప్రకటించింది. 120 హెర్ట్జ్ వరకు స్క్రీన్ రిఫ్రెష్ రేట్ ఫీచర్ కూడా ఇందులో ఉండనుంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 12 జీబీ వరకు ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 256 జీబీ వరకు యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్ ఇందులో ఉండనున్నాయి.
ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు ఉండనున్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 48 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 50 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, మరో 8 మెగాపిక్సెల్ కెమెరా కూడా ఉండనున్నాయి. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 32 మెగాపిక్సెల్ కెమెరాను అందించనున్నారని వార్తలు వస్తున్నాయి. ఐపీ68 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్ కూడా ఇందులో ఉండనుంది.
Also Read: Samsung Offers: గుడ్‌న్యూస్.. ఈ శాంసంగ్ ఫోన్ ధర తగ్గింపు.. ఇప్పుడు రూ.13 వేలలోపే!
Also Read: Cheapest 5G Phone: వేడెక్కుతున్న 5జీ మార్కెట్.. రూ.20 వేలలోపే మరో 5జీ ఫోన్!
Also Read: Tecno Camon 18: ముందు, వెనక 48 మెగాపిక్సెల్ కెమెరాలు.. ధర రూ.15 వేలలోపే.. వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ ఫ్రీ!
Also Read: Lost Aadhar Card: ఆధార్ కార్డు పోయిందా.. స్మార్ట్ ఫోన్‌లో ఇలా చేస్తే చాలు.. కొత్త ఆధార్ ఇంటికి!