ఆన్‌లైన్ షాపింగ్‌(Online Shopping)... చాలా మంది చేసేదే. కొన్నిసార్లు అంతా బావుంటుంది. ఆల్ హ్యాపీస్. కొన్నిసార్లు అయితే చేదు అనుభవం ఎదురవుతూ ఉంటుంది. ఆన్‌లైన్ షాపింగ్‌లో మోసపోయిన వ్యక్తులు కూడా ఉంటారు. అందుకు హీరోయిన్లు కూడా అతీతం ఏమీ కాదని చెప్పాలి. దీనికి లేటెస్ట్ ఎగ్జాంపుల్‌... నుపుర్ సనన్. ఆమె ఆన్‌లైన్ షాపింగ్ చేసి మోస‌పోయిన‌ట్టు ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె వెల్ల‌డించారు.
"ఫేక్ అలర్ట్ (fake alert). ఈ వెబ్‌సైట్‌లో కొంత మంది దొంగలు ఉన్నారు. మీ డబ్బులు తీసుకుని కొన్ని నెలలు అయినా సరే తిరిగి ఇవ్వరు. బేసిక్ ఆర్డర్ కన్ఫర్మేషన్ మెయిల్ కూడా సెండ్ చేయరు. ఫోన్ నంబర్ ఏదీ ఇవ్వరు. ఆర్డర్ చేసిన దుస్తుల గురించి అయితే మర్చిపోవడమే. నేను మోసపోయాను. మిమ్మల్ని కాపాడటం కోసమే ఈ పోస్ట్. ఇన్‌స్టాగ్రామ్ త‌ర‌చూ ఈ వెబ్‌సైట్ యాడ్ చూపించేస‌రికి జెన్యూన్ అనుకున్నాను. వాట్ ద హెల్" అని నుపుర్ సనన్ (nupur sanon) పోస్ట్ చేశారు.


తెలుగులో మహేష్ బాబు సరసన 'వన్ నేనొక్కడినే'లో, అక్కినేని నాగ చైతన్య సరసన 'దోచేయ్' సినిమాల్లో కథానాయికగా నటించిన కృతీ సనన్ (Kriti Sanon) గుర్తు ఉన్నారు కదా! ఆమెకు నుపుర్ సనన్ సిస్టర్. అక్షయ్ కుమార్ 'ఫిల్హాల్' సాంగ్‌లో హీరోయిన్‌గా న‌టించారు. ర‌కుల్ ప్రీత్ సింగ్ బాయ్‌ఫ్రెండ్ జాకీ భ‌గ్నాని ప్రొడ్యూస్ చేయబోయే ఓ సినిమాలో హీరోయిన్‌గా సంత‌కం చేశారు.





Also Read: మంచు విష్ణు కూడా నిర్మాతే.. మోహన్ బాబు వ్యాఖ్యలపై బడా నిర్మాత షాకింగ్ కామెంట్స్
Also Read: అక్కడ ఆస్పత్రిలో హార్ట్ ఎటాక్‌తో తల్లి... ఇక్కడ ఇండియాలో కేసుల్లో చిక్కుకున్న హీరోయిన్!
Also Read: 'రాధే శ్యామ్'ను డైరెక్టుగా ఓటీటీలో విడుదల చేస్తారా? ఆడియ‌న్స్‌ను మోసం చేయ‌డ‌మేనా?
Also Read: ఖరీదైన ఆడి కారు కొన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్... అంత రేటు పెట్టి కొన్నారా?
Also Read: గతం గురించి కామెంట్... సమంత మాటల్లో చాలా మీనింగ్ ఉందిగా!
Also Read: 'ఆల్రెడీ ఢీ మానేశాను. ఇంకేం మానాలిరా బాబూ!' - 'సుడిగాలి' సుధీర్ సెల్ఫ్ సెటైర్... అన‌సూయ ఈజ్ బ్యాక్‌!
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి