Mohan Babu: మంచు విష్ణు కూడా నిర్మాతే.. మోహన్ బాబు వ్యాఖ్యలపై బడా నిర్మాత షాకింగ్ కామెంట్స్

ఇండస్ట్రీ సమస్యలపై ఇటీవల మోహన్ బాబు ఓ లేఖ విడుదల చేశారు. దానిపై ప్రముఖ నిర్మాత సి. కల్యాణ్ స్పందించారు.

Continues below advertisement

తెలుగు సినిమా ఇండస్ట్రీ సమస్యలను పరిష్కరించడానికి కలెక్షన్ కింగ్ డా. మోహన్ బాబు ముందు ఉంటానని అంటే... పరిష్కరిస్తానంటే... నిర్మాతలమంతా ఆయన వెంట ఉంటామని ప్రముఖ నిర్మాత, నిర్మాతల మండలి అధ్యక్షుడు సి. కల్యాణ్ వ్యాఖ్యానించారు. 'కలిసి సినిమాను బతికిద్దాం' అంటూ ఇటీవల ఇండస్ట్రీని ఉద్దేశిస్తూ మోహన్ బాబు ఓ లేఖ రాశారు. అదీ ఇండస్ట్రీ పెద్దగా తాను ఉండనని, బాధ్యత గల బిడ్డగా ఉంటానని మెగాస్టార్ చిరంజీవి ఓ సమావేశంలో వ్యాఖ్యానించిన తర్వాత మోహన్ బాబు నుంచి లేఖ వచ్చింది. ఈ నేపథ్యంలో ఇండస్ట్రీ పెద్ద ఎవరనే చర్చ మొదలు అయ్యింది.

Continues below advertisement

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల సమయంలో మంచు ఫ్యామిలీ వర్సెస్ మెగా కాంపౌండ్ అన్నట్టు వాతావరణం వేడెక్కింది. ఆ తర్వాత తమ మధ్య ఏమీ గొడవలు లేవని... ఎన్నికల తర్వాత తనకు చిరంజీవి ఫోన్ చేశారని మోహన్ బాబు తెలిపారు. 'మా' ఎన్నికల సమయంలో ఏపీలో టికెట్ రేట్స్ సమస్య, ఆ తర్వాత థియేటర్స్ ఇష్యూస్ వచ్చాయి. ఏపీ ముఖ్యమంత్రి మంచు విష్ణుకు బావ వరుస కావడం... మంచు కుటుంబానికి, ముఖ్యమంత్రికి బంధుత్వం ఉండటంతో మోహన్ బాబు స్పందించాలని 'రిపబ్లిక్' ప్రీ రిలీజ్ వేడుకలో పవన్ కల్యాణ్ కూడా కోరారు. ఎన్నికల తర్వాత మోహన్ బాబు స్పందిస్తానని చెప్పారు.


Also Read: నా మౌనం చేతకానితనం, చేవలేనితనం కాదు.. టికెట్ రేట్ ఇష్యూపై మోహన్ బాబు కామెంట్స్..


ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ప్రభుత్వాలకు కాకుండా... సినిమా  పరిశ్రమలో జనాలకు మోహన్ బాబు రాశారు. ఆయన లేఖపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే... ఆ లేఖలో 'అసలు ప్రొడ్యూసర్ కౌన్సిల్ సమస్యను భుజాల మీద వేసుకోకుండా ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు ఎందుకు మౌనం వహిస్తుందో అర్థం కావడం లేదు' అని పేర్కొన్నారు. దీనిపై నిర్మాతల మండలి అధ్యక్షుడు సి. కల్యాణ్ స్పందిస్తూ... "సినిమా పరిశ్రమలో సమస్యలపై ప్రభుత్వాలతో ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ చర్చిస్తూ ఉంది. మోహన్ బాబు గారి ఫ్యామిలీలో అందరూ సినిమా రంగంలో ఉన్నారు. ఆయన ముందుండి సమస్యను పరిష్కరిస్తానంటే... ఆయన వెంట నడవడానికి మేం సిద్ధంగా ఉన్నాం. నిర్మాతల్లో ఐక్యత లేనందువల్ల ఇటువంటి సమస్యలు వస్తున్నాయని ఆయన అన్నారు. మోహన్ బాబు, ఆయన కుమారుడు విష్ణు కూడా నిర్మాతలే. సమస్యల్ని పరిష్కరిస్తామంటే మేమంతా ఆయనతో పాటు ఉంటాం" అని పేర్కొన్నారు. ఈయన వ్యాఖ్యలపై మోహన్ బాబు కుటుంబం స్పందిస్తుందో? లేదో? చూడాలి. వెయిట్ అండ్ సి. 


Also Read: అక్కడ ఆస్పత్రిలో హార్ట్ ఎటాక్‌తో తల్లి... ఇక్కడ ఇండియాలో కేసుల్లో చిక్కుకున్న హీరోయిన్!
Also Read: 'రాధే శ్యామ్'ను డైరెక్టుగా ఓటీటీలో విడుదల చేస్తారా? ఆడియ‌న్స్‌ను మోసం చేయ‌డ‌మేనా?
Also Read: ఖరీదైన ఆడి కారు కొన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్... అంత రేటు పెట్టి కొన్నారా?
Also Read: బాధలో దీప్తి సునయన.. చిల్ అవుతోన్న సిరి, షణ్ముఖ్..
Also Read: ఎన్టీఆర్ రెండు పడవల మీద అడుగులు వేస్తారా?
Also Read: గతం గురించి కామెంట్... సమంత మాటల్లో చాలా మీనింగ్ ఉందిగా!
Also Read: 'ఆల్రెడీ ఢీ మానేశాను. ఇంకేం మానాలిరా బాబూ!' - 'సుడిగాలి' సుధీర్ సెల్ఫ్ సెటైర్... అన‌సూయ ఈజ్ బ్యాక్‌!
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Continues below advertisement
Sponsored Links by Taboola