సినిమా స్టార్స్ ఖరీదైన కారులు కొంటుంటారు. స్టార్స్‌తో పాటు స్టార్స్ ఉపయోగించే కార్స్ కూడా హాట్ టాపిక్ అవుతుంటాయి. అనసూయ ఆడి కారు మీద 'జబర్దస్త్' షోలో పడిన పంచ్ డైలాగ్స్ అన్నీ ఇన్నీ కాదు. స్టార్స్ ఉపయోగించే కార్స్ మీద అందరి దృష్టి పడుతుందని చెప్పడానికి అదొక ఉదాహరణ. స్టార్స్ ఖరీదైన కార్లు కొన్నప్పటి కంటే క్యారెక్టర్ ఆర్టిస్టులు, యాంకర్లు కొన్నప్పుడు పెద్ద డిస్కషన్ అవుతుంది. ఇప్పుడు హిందీ సినిమా ఇండస్ట్రీలో అటువంటి డిస్కషన్ జరిగింది.



తెలుగులో పవన్ కల్యాణ్ 'బాలు ఎబిసిడిఈఎఫ్‌జి' సినిమాలో న్యాయవాది పాత్రతో పాటు 'అల్లరి బుల్లోడు' సినిమాలో ఓ పాత్రలో నటించిన సౌరభ్ శుక్లా ఉన్నారు కదా! హిందీలో పలు సినిమాల్లో ఆయన క్యారెక్టర్ ఆర్టిస్టుగా కనిపించారు. ఆయన స్క్రీన్ రైటర్, డైరెక్టర్ కూడా! ఆయన ఆడి కొత్త కారు కొన్నారు. ఆడి క్యూ2 ఎస్‌యువి కారు సొంతం చేసుకున్నారు. దాని ఖరీదు రూ. 35 లక్షల నుంచి రూ. 49 లక్షలు ఉంటుంది. గత ఏడాది డిసెంబర్ 25న ఆయన కారు కొన్నట్టు ఆడి ముంబై బ్రాండ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.


హిందీలో నటుడిగా సినిమాలు చేస్తున్న సౌరభ్ శుక్లా... ఓ సినిమాకు దర్శకత్వం కూడా వహిస్తున్నారు. డింపుల్ కపాడియా, పంకజ్ కపూర్ ప్రధాన పాత్రల్లో 'జబ్ ఖులీ కితాబ్' సినిమా తీస్తున్నారు. ర‌ణ్‌బీర్ క‌పూర్‌ 'షేర్ షా'లో ఓ రోల్ కూడా చేస్తున్నారట. మొత్తం మీద ఆడి కార్ సొంతం చేస్తున్న స్టార్స్ క్ల‌బ్‌లో సౌరభ్ శుక్లా కూడా చేరారు. బాలీవుడ్ స్టార్స్ ఆడి కార్ కొన‌డం పెద్ద పాయింట్ కాదు. ఆడి కంటే ఖ‌రీదైన కార్లు చాలామంది కొన్నారు. కానీ, ఓ ఆర్టిస్ట్ క‌మ్ డైరెక్ట‌ర్ కొన‌డం పెద్ద పాయింటే.
Also Read: ఎన్టీఆర్ రెండు పడవల మీద అడుగులు వేస్తారా?
Also Read: గతం గురించి కామెంట్... సమంత మాటల్లో చాలా మీనింగ్ ఉందిగా!
Also Read: 'ఆల్రెడీ ఢీ మానేశాను. ఇంకేం మానాలిరా బాబూ!' - 'సుడిగాలి' సుధీర్ సెల్ఫ్ సెటైర్... అన‌సూయ ఈజ్ బ్యాక్‌!
Also Read: బాసూ... క్లాస్‌గా మెగాస్టార్ మాస్ స్టెప్పేస్తే? ఫుల్ సాంగ్ వచ్చేసింది... చూశారా?
Also Read: 'రాధే శ్యామ్' నిర్మాతలకు కొత్త తలనొప్పి... రోజుకు ఓసారి ఆ మాట చెప్పాల్సిందేనా?
Also Read: త్రివిక్రమ్ క్లాప్‌తో సినిమా మొదలు... బుధవారం నుంచి క్లాసులు!
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి