పాపం... బాలీవుడ్ హీరోయిన్, విదేశీ భామ జాక్వ‌లిఫ్ ఫెర్నాండేజ్‌కు గత ఏడాది చివరి నుంచి ఏమాత్రం కలసి రావడం లేదు. ఈ ఏడాది ప్రారంభం కూడా ఆమెకు ఏమాత్రం కలసి రాలేదు. జాక్వలిన్ తల్లి కిమ్ ఫెర్నాండేజ్ హార్ట్ ఎటాక్‌తో గుండె పోటు (హార్ట్ ఎటాక్)తో ఆస్పత్రిలో చేరినట్టు సమాచారం అందుతోంది. జాక్వలిన్ కుటుంబం బ‌హ్రెయిన్‌లో నివాసం ఉంటోంది. హార్ట్ ఎటాక్ వచ్చిన వెంటనే కిమ్‌ను ఆస్పత్రికి తీసుకు వెళ్లారు. వైద్యుల పర్యవేక్షణలో చికిత్స జరుగుతోంది. ఆమె పరిస్థితి ఏమిటన్నది కొన్ని గంటలు గడిస్తే తెలుస్తుంది.


సుఖేష్ చంద్రశేఖర్ కేసులో జాక్వలిన్ ఫెర్నాండేజ్ భారత దేశం వదిలి వెళ్లకూడదని గత ఏడాది డిసెంబర్ నెలలో ఈడీ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఆమె విదేశాలు బయలు దేరితే ఎయిర్ పోర్ట్ ద‌గ్గ‌ర అధికారులు అడ్డుకున్నారు. దాంతో కిస్మస్ వేడులను సెలబ్రేట్ చేసుకోవడానికి ఆమె కుటుంబం దగ్గరకు కూడా వెళ్లలేకపోయారు. ఇప్పుడు తల్లి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నప్పటికీ... బహ్రెయిన్ వెళ్లే వీలు లేకుండా పోయింది. తల్లి గురించి జాక్వలిన్ తీవ్రంగా ఆలోచిస్తున్నారని బాలీవుడ్ టాక్.


'రామ్ సేతు', 'సర్కస్', 'ఎటాక్'... జాక్వలిన్ చేతిలో బాలీవుడ్ సినిమాలు ఉన్నాయి. అయితే... సినిమాల కంటే ఇటీవల ఈడీ కేసులో ఆమె పేరు ఎక్కువ  వినబడుతోంది. దీనికి తోడు సుఖేష్ చంద్రశేఖర్, జాక్వలిన్ రిలేషన్ మీద ఓ వెబ్ సిరీస్ తెరకెక్కించడానికి సన్నాహాలు జరుగుతున్నాయని బాలీవుడ్ సమాచారం.






Also Read: 'రాధే శ్యామ్'ను డైరెక్టుగా ఓటీటీలో విడుదల చేస్తారా? ఆడియ‌న్స్‌ను మోసం చేయ‌డ‌మేనా?
Also Read: ఖరీదైన ఆడి కారు కొన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్... అంత రేటు పెట్టి కొన్నారా?
Also Read: బాధలో దీప్తి సునయన.. చిల్ అవుతోన్న సిరి, షణ్ముఖ్..
Also Read: ఎన్టీఆర్ రెండు పడవల మీద అడుగులు వేస్తారా?
Also Read: గతం గురించి కామెంట్... సమంత మాటల్లో చాలా మీనింగ్ ఉందిగా!
Also Read: 'ఆల్రెడీ ఢీ మానేశాను. ఇంకేం మానాలిరా బాబూ!' - 'సుడిగాలి' సుధీర్ సెల్ఫ్ సెటైర్... అన‌సూయ ఈజ్ బ్యాక్‌!
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి