వచ్చే ఎన్నికలు ఆషామాషీవి కావని.. రౌడీయిజాన్ని, విధ్వంసాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని .. అందుకే మెతకగా ఉండే నాయకత్వం అవసరం లేదని టీడీపీ నియోజకవర్గ ఇంచార్జ్‌లకు చంద్రబాబునాయుడు తేల్చి చెప్పారు. నియోజకవర్గ ఇంచార్జ్‌లతో ఆయన మంగళగిరి టీడీపీ ఆఫీసులో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఇంచార్జ్‌ల పనితీరు.. రాజకీయ పరిస్థితులపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. పని చేయని ఇంచార్జ్‌లను నిర్మోహమాటంగా తప్పించేస్తానని స్పష్టం చేశారు. ఇప్పటి రాజకీయాల్లో ఢీ అంటే డీ అనే నాయకత్వమే రాణిస్తుందని.. మెతకగా ఉంటే పార్టీకి నష్టమన్నారు. 


Also Read: గురువారమే పీఆర్సీ ఎపిసోడ్‌కు ముగింపు.. ఉద్యోగ సంఘాలతో సీఎం భేటీ ఖరారు !?


నియోజకవర్గ ఇంచార్జ్‌లు కొంత మంది వారి వారి నియోజకవర్గ పని చేయడం లేదని చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. పని చేయని.. పని చేయడం ఇష్టం లేని ఇంచార్జ్‌ స్వచ్చందంగా తప్పుకోవాలని సూచించారు.  అలా చేస్తే కొత్త వారికి అవకాశం ఇస్తామన్నారు. ఒక వేళ వారు తప్పుకోకపోయినా పని చేసిన ఇంచార్జ్‌లను తప్పించడానికి రంగం సిద్ధం చేశామని చంద్రబాబు పరోక్షంగా సంకేతాలు పంపారు.  టీడీపీలో ఉంటూ ఇతర పార్టీల నేతలతో సన్నిహిత సంబంధాలు నిర్వహించే వారిపైనా కీలక వ్యాఖ్యలు చేశారు. అలాంటి వారితో పార్టీకి నష్టం కలుగుతందన్నారు. అలాంటి వారిని సహించబోమని స్పష్టం చేశారు. 


Also Read: కొడాలి నాని ఎవరో తెలియదు.. నాచురల్ స్టార్ నానీ ఒక్కడే తెలుసు! ఆర్జీవీ రివర్స్ పంచ్ రేంజే వేరు


ప్రస్తుత రాజకీయాల్లో రౌడీయిజం.. విధ్వంంపై పోరాడాల్సి ఉందన్నారు. కుప్పం నియోజకవర్గంలో తననే ఇబ్బంది పెట్టారని.. ఇక మిగిలిన నియోజకవర్గాల్లో పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి అని చంద్రబాబు నియోజకవర్గ ఇంచార్జ్‌లకు సూచించారు. పార్టీలో ఉంటూ నష్టం చేసే వ్యక్తులను ఉపేక్షించబోనన్నారు. ఎన్నికల సమయం దగ్గర పడుతున్నందున చంద్రబాబు పార్టీ నేతలందరూ పూర్తి స్థాయిలో కార్యక్రమాలు నిర్వహించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 


Also Read: పవన్ సినిమాకి సంపూ సినిమాకి తేడా లేనప్పుడు మీ ప్రభుత్వంలో మంత్రికి డ్రైవర్‌కి కూడా తేడా లేదా? ఆర్జీవీ స్ట్రాంగ్‌ కౌంటర్


గత ఎన్నికల్లో టీడీపీ ఓటమి తర్వాత చాలా నియోజకవర్గాల్లో నేతలు సైలెంటయిపోయారు. ప్రభుత్వ వేధింపులు, దాడుల భయంతో కొంత మంది నేతలు పార్టీ కూడా మారిపోయారు. ఇప్పుడు పరిస్థితులు మారుతూండటంతో పార్టీ మారిన వారు మళ్లీ తిరిగి వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అదే సమయంలో నియోజకవర్గాల్లో చురుగ్గా లేని వారికి చందర్బాబు మరో చాన్స్ ఇస్తున్నారు.  అప్పటికి మారకపోతే ఇంచార్జ్‌లను మార్చేస్తున్నారు. ఈ క్రమంలో ఇంచార్జ్‌లకు చివరి వార్నింగ్ ఇచ్చినట్లుగా టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. 


Also Read: గతం గురించి కామెంట్... సమంత మాటల్లో చాలా మీనింగ్ ఉందిగా!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి