ఆంధ్రప్రదేశ్‌లో టికెట్ల వ్యవహారం ఇంకా సద్దుమణగలేదు. ప్రభుత్వం, దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ మధ్య వివాదం మరింత రాజుకుంటోంది. ప్రశ్నలతో ప్రభుత్వాన్ని ఆర్జీవీ నిలదీస్తుంటే... రివర్స్ అటాక్‌తో మంత్రి పేర్ని నాని విరుచుకు పడ్డారు. గత మూడు రోజులుగా వీళ్ల మధ్య వార్ నడుస్తోంది.
నిన్న ఆర్జీవీ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన మంత్రి పేర్ని నాని... రూ.100 టికెట్‌ను రూ.వెయ్యికి, రూ.2 వేలకి అమ్ముకోవచ్చని ఏ బేసిక్ ఎకనమిక్స్ చెప్పాయి? ఏ చట్టం చెప్పింది? దీన్ని ఏ మార్కెట్ మెకానిజం అంటారు? డిమాండ్ అండ్ సప్లై అంటారా? లేక బ్లాక్ మార్కెటింగ్ అంటారా? సామాన్యుడి మోజుని, అభిమానాన్ని లూటీ చేసే పరిస్థితి లేకుండా చూసేందుకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు 66 ఏళ్ళుగా చట్టాలకు లోబడే సినిమా టికెట్ ధరను నిర్ణయిస్తున్నాయి.’’ అని ఎదురు ప్రశ్నలు వేశారు దీనికి వర్మ కూడా కౌంటర్ అటాక్ చేశారు.
ప్రభుత్వంలో ఉన్న కొందరి గురించి ప్రస్తావిస్తూనే ప్రభుత్వ చర్యలను నిలదీశారు. ఆయన ఏమన్నారంటే... "నేనడిగే ముఖ్య ప్రశ్న టికెట్ ధర నిర్ణయించటానికి ప్రభుత్వం ఎవరని? పవన్ కళ్యాణ్ సినిమాకి సంపూర్ణేష్ బాబు సినిమాకి మీ ప్రభుత్వం లో తేడా లేనప్పుడు మంత్రిగా మీకు మీ డ్రైవర్ కి కూడా తేడా లేదా?"
కొంతమందిలాగా నోరేసుకోని పడిపోకుండా కూల్‌గా రియాక్ట్ అయినందుకు ముందుగా పేర్ని నానికి థ్యాంక్స్ చెప్పారు. తర్వాతా ప్రశ్నలు సంధించారు.
టాక్స్‌లు సరిగా వస్తున్నాయా రాలేదా అన్నదానిపై ప్రభుత్వం కాన్‌సెంట్రేషన్ చేయాలే కానీ... మిగతా వాటి గురించి ఎందుకని ఆర్జీవీ ఫైర్ అయ్యారు. ఓపెన్‌గా రేటు చెప్పి అమ్ముతున్నప్పుడు అది క్రైం ఎలా అవుతుందని డౌట్ వ్యక్తం చేశారు.
డిమాండ్,సప్లై థియరీ ప్రకారం సినిమా ఇండస్ట్రీ పని చేస్తుందని... బాంబేలో రోజును బట్టి సినిమాను బట్టి టికెట్ రేట్లు ఉంటాయని గుర్తు చేశారు రామ్‌గోపాల్ వర్మ.
విపత్కార పరిస్థితుల్లోనే ప్రభుత్వాల జోక్యం అవసరమని... సినీ పరిశ్రమలో అలాంటి పరిస్థితి ఏమైనా వచ్చిందా అంటూ పేర్ని నానిని ప్రశ్నించారు ఆర్జీవీ.
థియేటర్లు అన్నీ కూడా బిజినెస్ కోసమే ఉన్నాయని... అలా కాకుండా ప్రజాకోణంలో వినోద సేవలు అందిస్తున్నాయని ఎక్కడా లేదని... మీకు మీరు ఇచ్చిన నిర్వచనమని పేర్ని నానికి ఘాటుగా రిప్లై ఇచ్చారు.
ఇంకా ఎదగాలి అనే మోటివేషన్‌ను ప్రోత్సహించేలా ప్రభుత్వ చర్యలు ఉండాలే కానీ... వాటిని తొక్కేలా ఉండకూడదన్నారు ఆర్జీవీ.
పేదల్ని బాగు చేయాలన్న ఆలోచన మంచిదే కానీ... ధనికుల్ని పేదవాళ్లుగా మారుస్తామన్న ఏపీ ప్రభుత్వ థియరీ డేంజర్ అన్నారు ఆర్జీవీ. ఇలా చేస్తే దేశంలోనే అత్యంత పేద రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మిగులుతుందన్నారు ఆర్జీవీ.
తిట్లతో, వ్యక్తిగత విమర్శలతో డిబేట్ చేయకుండా చాలా డిగ్నిటీతో రియాక్ట్ అయ్యారని మంత్రి పేర్ని నానికి థ్యాంక్స్ చెప్పారు ఆర్జీవీ. లాజికల్ కన్‌క్లూజన్ మాత్రమే సమస్యకు పరిష్కారమన్నారు.
తాను యావరేజ్ స్టూడెంట్‌నని.. ఎకనామిక్స్‌లో కూడా వీక్ అని... కానీ ప్రభుత్వంలో ఎవరైనా నిపుణులు వస్తే పబ్లిక్ డిబేట్‌కు రెడీ అని సవాల్ చేశారు. సినిమా పరిశ్రమపై ఉన్న ఒత్తిడి తగ్గించేందుకు సిద్ధమని అన్నారు రామ్‌గోపాల్ వర్మ.
Also Read: ఆర్జీవీ 10 ప్రశ్నలకు మంత్రి పేర్ని నాని కౌంటర్.. ‘ఆ ఫార్ములా ఏంటి వర్మగారూ’ అంటూ వరుస ట్వీట్లు
Also Read: RGV Questions AP Govt: వర్మ వదలడం లేదుగా... ఏపీ ప్రభుత్వానికి ఆర్జీవీ సంధించిన తాజా ప్రశ్నలు!
Also Read: ఖరీదైన ఆడి కారు కొన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్... అంత రేటు పెట్టి కొన్నారా?
Also Read: గతం గురించి కామెంట్... సమంత మాటల్లో చాలా మీనింగ్ ఉందిగా!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి