ఊహించిందే జరిగింది.. ప్రభాస్ నటించిన 'రాధేశ్యామ్' సినిమాను కూడా పోస్ట్ పోన్ చేశారు. 'ఆర్ఆర్ఆర్' సినిమా వాయిదా పడినప్పుడు 'రాధేశ్యామ్' కూడా వాయిదా పడుతుందంటూ వార్తలు వచ్చాయి. కానీ అందులో నిజం లేదని చెప్పింది చిత్రబృందం. ఇప్పుడు మాత్రం సినిమాను వాయిదా వేయక తప్పడం లేదంటూ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.
నిన్న కూడా చిత్ర దర్శకుడు రాధాకృష్ణ ఇన్‌డైరెక్ట్ గా సినిమా పోస్ట్ పోన్ అవుతుందంటూ హింట్ ఇచ్చారు. కావాలనే ఫ్యాన్స్ ను ముందుగానే ప్రిపేర్ చేస్తూ.. ఈరోజు పోస్ట్ పోన్ అనౌన్స్మెంట్ చేశారు. చాలా రోజులుగా సినిమాను విడుదల చేయడానికి ప్రయత్నించామని.. కానీ ఒమిక్రాన్ కేసులు రోజురోజుకి పెరిగిపోతున్నాయని.. తప్పనిసరి పరిస్థితుల్లో సినిమాను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
ఈ ట్వీట్ చూసిన అభిమానులు 'రాధేశ్యామ్' టీమ్ ని ట్రోల్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల కారణంగా భారీ బడ్జెట్ సినిమాలన్నీ వాయిదా పడుతూ వస్తున్నాయి. నార్త్ లో చాలా స్టేట్స్ లో కర్ఫ్యూలు విధించారు. తమిళనాడుతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో థియేటర్లను మూసేశారు. ఏపీలో టికెట్ రేట్ ఇష్యూ ఇప్పటికీ అలానే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో సినిమాను విడుదల చేస్తే.. నిర్మాతలు భారీగా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. అందుకే ఆ రిస్క్ తీసుకోవడానికి ఎవరూ ముందుకు రావడం లేదు.
రెబల్‌స్టార్ కృష్ణంరాజు సమర్పణలో గోపీకృష్ణా మూవీస్, యువీ క్రియేషన్స్ పతాకాలపై ప్రమోద్, వంశీ, ప్రశీద ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యూరప్ నేపథ్యంలో జరిగే పీరియాడికల్ లవ్‌స్టోరిగా ఈ సినిమాను రూపొందించారు. దాదాపు మూడు వందల కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించారు.
Also Read: హీరోగా ఎన్టీఆర్ బావమరిది.. డైరెక్టర్ ఎవరంటే..?
Also Read: 'ఇండస్ట్రీ పెద్ద దిక్కుగా ఉండాలనుకోవడం మూర్ఖత్వం.. ' స్పందించిన వర్మ..
Also Read: 'స్పిరిట్' సినిమాలో ప్రభాస్ రోల్ ఇదే.. రివీల్ చేసిన నిర్మాత..
Also Read: సంక్రాంతి రేసులో డబ్బింగ్ సినిమాలు.. అజిత్ Vs విశాల్..
Also Read: ఇది చాలా టఫ్ టైం.. 'రాధేశ్యామ్' దర్శకుడు హింట్ ఇస్తున్నాడా..?
Also Read: ఇప్పుడు నోళ్లు మూసుకుంటే ఇంకెప్పటికీ తెరవలేరు.. వర్మ ఫైర్..