తెలుగు సినిమా ఇండస్ట్రీలో వారసులకు కొదవలేదు. ఇప్పటికే చాలా మంది వారసులు నటులుగా చెలామణి అవుతున్నారు. ఇప్పుడు మరో వారసుడు కూడా రావడానికి సిద్ధమవుతున్నాడు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ బావమరిది నితిన్ చంద్ర త్వరలోనే హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడని తెలుస్తోంది. ఇతడు ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి సోదరుడు. ప్రముఖ వ్యాపారవేత్త, ఎన్ స్టూడియో అధినేత నార్నే శ్రీనివాస రావు కుమారుడు. చాలా కాలంగా నితిన్ చంద్రను ఇండస్ట్రీకి పరిచయం చేయాలని చూస్తున్నారు. 


కానీ ఆలస్యమవుతూ వస్తోంది. తేజ దర్శకత్వంలో నితిన్ చంద్ర హీరోగా పరిచయం కావాల్సి వుంది. కొన్ని కారణాల వలన ఆ ప్రాజెక్ట్ మధ్యలోనే ఆగిపోయింది. దీంతో మళ్లీ కథలు వినడం మొదలుపెట్టారు. ఇటీవల దర్శకుడు సతీష్ వేగ్నేశ చెప్పిన కథ నచ్చడంతో అతడి దర్శకత్వంలోనే నితిన్ చంద్రను పరిచయం చేయాలని చూస్తున్నారు. దీనికి నిర్మాతగా నార్నే శ్రీనివాసరావే వ్యవహరిస్తారట. ఈ మధ్యే నటనలో శిక్షణ కూడా పూర్తి చేసుకుని వచ్చాడు నితిన్ చంద్ర. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ ను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. 


సంపద అనే కన్నడ అమ్మాయి ఈ సినిమాలో హీరోయిన్ గా నటించబోతుందని తెలుస్తోంది. 'శతమానం భవతి' మాదిరి విలేజ్ బ్యాక్ డ్రాప్ లో యూత్ ఫుల్ లవ్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. గోదావరి జిలాల్లోనే షూటింగ్ నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని లొకేషన్స్ ను కూడా ఫిక్స్ చేసుకున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ పై అఫీషియల్ అనౌన్స్మెంట్ రాబోతుంది. 


దర్శకుడు సతీష్ వేగ్నేశకి 'శతమానం భవతి' తరువాత ఆ స్థాయిలో హిట్ పడలేదు. ఆయన డైరెక్ట్ చేసిన 'శ్రీనివాస కళ్యాణం', 'ఎంత మంచివాడవురా' లాంటి సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. దీంతో గ్యాప్ తీసుకొని నితిన్ చంద్రతో సినిమా చేయబోతున్నాడు. మరి ఈ సినిమాతోనైనా హిట్ అందుకుంటారేమో చూడాలి! 


Also Read: 'ఇండస్ట్రీ పెద్ద దిక్కుగా ఉండాలనుకోవడం మూర్ఖత్వం.. ' స్పందించిన వర్మ..


Also Read: 'స్పిరిట్' సినిమాలో ప్రభాస్ రోల్ ఇదే.. రివీల్ చేసిన నిర్మాత..


Also Read: సంక్రాంతి రేసులో డబ్బింగ్ సినిమాలు.. అజిత్ Vs విశాల్..


Also Read: ఇది చాలా టఫ్ టైం.. 'రాధేశ్యామ్' దర్శకుడు హింట్ ఇస్తున్నాడా..?


Also Read: ఇప్పుడు నోళ్లు మూసుకుంటే ఇంకెప్పటికీ తెరవలేరు.. వర్మ ఫైర్..


Also Read: రాజమౌళితో కరణ్ జోహార్ ప్లాన్.. వర్కవుట్ అవుతుందా..?




ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి