అల్లు అర్జున్-రష్మిక హీరో హీరోయిన్లుగా సుకుమార్ తెరక్కించిన మూవీ పుష్ప.  మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై భారీగా తెరకెక్కిన ఈ సినిమా డిసెంబరు 17న విడుదలైంది. ఫహద్ ఫాజిల్, సునీల్, అనసూయ కీలకపాత్రల్లో నటించారు. తాజాగా ఈ మూవీ చూసిన మహేష్ బాబు ట్విట్టర్ వేదికగా తన అభిప్రాయం షేర్ చేసుకున్నాడు. పుష్ప పై మహేష్ రివ్యూ అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  






పుష్పరాజ్‌గా అల్లు అర్జున్ నటన స్టన్నింగ్ అని పొగిడిన మహేష్ బాబు.. ఇది ఒరిజినల్ అని ట్వీట్ చేశాడు. తన సినిమాలు ఎంత వాస్తవంగా, నిజాయితీగా ఉంటాయనేది సుకుమార్ మరోసారి నిరూపించారని పోస్ట్ చేశాడు. 'నీ గురించి ఏం చెప్పాలి? దేవి శ్రీ ప్రసాద్ నువ్వు రాక్ స్టార్‌ అంతే అని ట్వీట్ చేసిన సూపర్ స్టార్...' పుష్ప' సినిమా నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్ టీమ్ మొత్తానికి కంగ్రాట్స్. బాయ్స్.. చాలా గర్వంగా ఉంది' అన్నాడు.






అయితే హీరో-దర్శకుడు-నిర్మాత-సంగీత దర్శకుడు ఇలా అందర్నీ పేరు పేరునా పొగిడిన మేహశ్ బాబు.. సరిలేవు నీకెవ్వరు సినిమాలో తనతో జోడీ కట్టి..ఇప్పుడు పుష్పరాజ్ శ్రీవల్లిగా మెప్పించిన రష్మిక గురించి ఎక్కడా ప్రస్తావించలేదు.  మరోవైపు మహేష్ బాబు ట్వీట్స్ చూసి హ్యాపీగా ఫీలైన బన్నీ అభిమానులు థ్యాంక్స్ చెబుతూ ట్వీట్స్ చేశారు.. 






భారీ బడ్జెట్ తో రూపొందిన  రేంజ్‌లో రూపొందిన 'పుష్ప' తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో రిలీజ్ చేశారు. విడుదలైన అన్ని భాషల్లోనూ ఈ సినిమా మంచి టాక్ సంపాదించుకుంది. 



Also Read: త్రివిక్రమ్ క్లాప్‌తో సినిమా మొదలు... బుధవారం నుంచి క్లాసులు!
Also Read: కృష్ణుడే సత్యభామ కాళ్లు పట్టుకున్నాడు... బాలకృషుడు ఓ లెక్కా!?
Also Read: లెఫ్ట్ హ్యాండ్ రెడీ.. వాళ్లు ఎదురుపడితే దబిడిదిబిడే.. వార్నింగ్ ఇచ్చిన బాలయ్య..
Also Read: The Boss: రామ్ గోపాల్ వర్మ బాబాగా మారితే?
Also Read: RGV: ఇండస్ట్రీ పెద్ద దిక్కుగా ఆర్జీవీ.. అజయ్ భూపతిని ఆడేసుకుంటున్నారుగా..
Also Read: బాలకృష్ణ సినిమాలో కన్నడ నటుడికి పవర్ ఫుల్ రోల్...
Also Read: త్వరలో తల్లి కానున్న హీరోయిన్... విడాకులు తీసుకున్నారా?
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి