బిహార్‌లోని ఓ వృద్దుడు ఏకంగా 11సార్లు కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నాడు. ఆధార్‌కార్డు, ఫోన్ నెంబర్‌ ఉపయోగించి ఇలా వ్యాక్సిన్ వేయించుకున్నాడు. 


బిహార్‌లోని మాధేపురా జిల్లాలోని ఒరై గ్రామానికి చెందిన 84 ఏళ్ల వ్యక్తి కోవిడ్ -19 వ్యాక్సిన్‌ను 11సార్లు తీసుకున్నాడు. 12వ డోస్ తీసుకునేందుకు వెళ్లి పట్టుబడ్డాడు.


బ్రహ్మదేవ్ మండల్‌ అనే వ్యక్తి ఏకంగా 11 సార్లు వ్యాక్సిన్ తీసుకోవడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. వ్యాక్సిన్ వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని అందుకే పలుమార్లు వ్యాక్సిన్  తీసుకున్నట్టు చెప్పాడా వ్యక్తి. 


"నేను వ్యాక్సిన్‌తో చాలా ప్రయోజనం పొందాను. అందుకే పదే పదే తీసుకుంటున్నాను" అని చెప్పాడు మండల్. 


రిటైర్డ్ పోస్టల్ డిపార్ట్‌మెంట్ ఉద్యోగి అయిన మండల్, గత ఏడాది ఫిబ్రవరిలో తన మొదటి కరోనా వ్యాక్సిన్‌ డోస్‌ తీసుకున్నాడు. అప్పటి నుంచి మార్చి, మే, జూన్, జూలై, ఆగస్టు  వ్యాక్సిన్ వేయించుకున్నాడు. 


అలా డిసెంబర్ 30 నాటికి  ఒకే పబ్లిక్ హెల్త్ సెంటర్‌లో 11 సార్లు వ్యాక్సిన్‌ వేసుకున్నాడు. ఆ వ్యక్తి తన ఆధార్ కార్డు, ఫోన్ నంబర్‌ను వినియోగించి ఎనిమిది సార్లు వ్యాక్సిన్ వేయించుకున్నాడు. మిగిలిన మూడు సందర్భాల్లో తన ఓటర్ ఐడి కార్డ్, అతని భార్య ఫోన్ నంబర్‌ను ఉపయోగించాడని అధికార్లు తేల్చారు. 






అధికారులను తప్పించి ఇన్ని సార్లు వ్యాక్సిన్‌లు ఎలా తీసుకున్నాడనే విషయంపై విచారణ చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు.


Also Read: PM Narendra Modi: పంజాబ్‌లో ప్రధాని మోదీకి నిరసన సెగ.. ర్యాలీ రద్దు చేసి హుటాహుటిన దిల్లీకి పయనం!


Also Read: Covid-19 Update: ఒక్కరోజే 58 వేల కరోనా కేసులు.. దేశంలో వైరస్ 'మహా' కల్లోలం


Also Read: WHO On Omicron: ఒమిక్రాన్ ఎఫెక్ట్.. మరిన్ని ప్రమాదకర వేరియంట్లు పుట్టుకొస్తాయని డబ్ల్యూహెచ్‌ఓ వార్నింగ్..!


Also Read: పిల్లలకు కరోనా వ్యాక్సిన్ వేయించారా? ఇవి అక్కర్లేదు.. గుర్తుపెట్టుకోండి


Also Read: PM Narendra Modi: పంజాబ్‌లో ప్రధాని మోదీకి నిరసన సెగ.. ర్యాలీ రద్దు చేసి హుటాహుటిన దిల్లీకి పయనం!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి