దేశంలో పెద్దలతో పాటు 15-18 ఏళ్ల పిల్లలకు కరోనా వ్యాక్సినేషన్ జోరుగా సాగుతోంది. అయితే కొవాగ్జిన్ టీకా తీసుకున్న పిల్లలకు పారాసెటిమాల్ లేదా పెయిన్ కిల్లర్స్ వాడాల్సిన పనిలేదని దేశీయ వ్యాక్సిన్ తయారీ సంస్థ భారత్ బయోటెక్ ప్రకటించింది. టీకా కేంద్రాల్లో ఇలా ఇస్తున్నట్లు తెలిసిందని కానీ వాటి అవసరం లేదని ట్వీట్ చేసింది.
దేశవ్యాప్తంగా 15-18 ఏళ్ల పిల్లలకు కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం జనవరి 3 నుంచి మొదలైంది. మొదటి రోజే 40 లక్షల మంది పిల్లలకు వ్యాక్సిన్ అందించారు. ఓవైపు ఒమిక్రాన్.. మరోవైపు కరోనా కేసులు పెరుగుతోన్న వేళ వ్యాక్సినేషన్‌ను మరింత వేగవంతం చేసింది ఆరోగ్య శాఖ.
భయం..
మరోవైపు దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. దేశంలో కొత్తగా 58,097 కరోనా కేసులు నమోదయ్యాయి. మరోవైపు ఒమిక్రాన్ కేసులు సంఖ్య కూడా 2100 మార్కు దాటింది. ప్రస్తుతం మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 2135కు చేరింది.
దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 2,14,004కు చేరింది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల శాతం 0.61%గా ఉంది. దేశంలో రికవరీ రేటు 98.01%గా ఉంది. డైలీ పాజిటివిటీ రేటు భారీగా పెరిగింది. ప్రస్తుతం 4.18%గా ఉంది.
Also Read: PM Narendra Modi: పంజాబ్‌లో ప్రధాని మోదీకి నిరసన సెగ.. ర్యాలీ రద్దు చేసి హుటాహుటిన దిల్లీకి పయనం!
Also Read: Covid-19 Update: ఒక్కరోజే 58 వేల కరోనా కేసులు.. దేశంలో వైరస్ 'మహా' కల్లోలం