తెలుగు రాష్ట్రాల‌్లో సంచలనం సృష్టించిన రామకృష్ణ కుటుంబ ఆత్మహత్య కేసులో పురోగతి సాధించినట్టు తెలుస్తోంది. కొత్తగూడెం నియోజకవర్గానికి చెందిన నలుగురిని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. అనేక సెటిల్‌మెంట్‌లలో రాఘవతో భాగస్వాములయ్యారని, రామకృష్ణ పంచాయతీ జరిగినప్పుడు కూడా ఈ నలుగురు ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. అందుకే వీరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.
కొత్తగూడెం నియోజకవర్గంలో రాజకీయంగా పలుకుబడి ఉన్న ఈ నలుగురు వ్యక్తులపై ఇప్పటికే అనేక అభియోగాలున్నాయి. అయితే రామకృష్ణ ఆత్మహత్యకు ముందు 15 పేజీల సూసైడ్ నోట్ రాసినట్లు ప్రచారం జరుగుతుంది. పంచాయతీ జరిగిన సందర్భంలో ఎవరెవరు ఉన్నారనే విషయాన్ని అందులో స్పష్టంగా పేర్కొనడంతో పోలీసులు ఆ దిశగా కేసు దర్యాప్తు వేగవంతం చేసినట్లు సమాచారం.
సెటిల్‌మెంట్లు.. బ్లాక్ దందాలే వీరి పని..
ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న నలుగురిలో ఒకరు రేషన్ బియ్యం రీ పాలిష్ దందాలో కీలక వ్యక్తి. మాజీ ఎంపీకి కొత్తగూడెంలో అనుచరుడిగా చలామణి అవుతున్నాడు. దీంతోపాటు మరో వ్యక్తి లిక్కర్ సిండికెట్ మాఫియాలో వ్యక్తి ఉన్నట్లు సమాచారం. వీరితోపాటు మరో ఇద్దరు నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. రామకృష్ణ సూసైడ్ నోట్ ఆధారంగా వీరిని రెండు రోజుల నుంచి విచారణ కొనసాగిస్తున్నారు.
నియోజకవర్గంలో జనాదరణ లేని ఈ నాయకులు కేవలం బ్లాక్ మార్కెటింగ్ దందాలకు పాల్పడుతూ రాఘవతోపాటు కలిసి సెటిల్‌మెంట్‌లలో పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. నల్లదందాలకు పాల్పడే నేతలతో కలిసే రాఘవ తరుచూ సెటిల్‌మెంట్లు చేస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే రామకృష్ణ కుటుంబంకు సంబందించిన పంచాయతీ విషయంలో ఈ నలుగురు కూడా భాగస్వామ్యం కావడంతో సూసైడ్ నోట్ ఆధారంగా పోలీసులు విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది.
బయటకు రాని సూసైడ్ నోట్..?
రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య చేసుకునే ముందు 15 పేజీల సూసైడ్ నోట్ రాసినట్లు ప్రచారం సాగుతుంది. ఇప్పటికే చనిపోయే ముందు చేసిన సెల్పీ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చనిపోయిన రోజు విడుదల చేసిన సూసైడ్ నోట్ కేవలం ఒక పేజీ మాత్రమే ఉండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే మిగిలిన పేజీల వివరాలు మాత్రం తెలియడం లేదు.
రామకృష్ణ ఆత్మహత్య కేసు విషయం జాతీయ స్థాయిలో సంచలనం కావడంతో దర్యాప్తు వేగవంతం చేసిన పోలీసులు సూసైడ్ నోట్ ఆధారంగానే విచారణ చేస్తున్నట్లు సమాచారం. ఏది ఏమైనప్పటికీ ఏఎస్పీ రోహిత్‌రాజ్ నేతృత్వంలోని పోలీసుల బృందం త్వరితగతిన కేసు విచారణ పూర్తి చేసి నిందులను కోర్టుకు రిమాండ్‌కు తరలించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే పంచాయతీ జరిగిన రోజు అక్కడ కూర్చున్న వారిని విచారించి కేసులో పురోగతి సాధించేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
Also Read: రామకృష్ణ కుటుంబ మరణానికి కారకుడైన వనమా రాఘవను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్.
Also Read: కేసీఆర్ వారికి ఆ పనులు చేసే లైసెన్సు ఇచ్చారా? వనమా దొరకలేదని చెప్పడం సిగ్గుచేటు: రాజాసింగ్
Also Read: పాల్వంచ కుటుంబం ఆత్మహత్య కేసులో మరో ట్విస్ట్... వనమా రాఘవను అరెస్టు చేయలేదని ఏఎస్పీ ప్రకటన
Also Read: వనమా రాఘవ ఆగడాలకు అడ్డేలేదా?... ఆది నుంచి ఆరోపణల పర్వమే...!