భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కుటుంబం ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వనమా రాఘవను టీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేసింది. టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ సూచ‌న‌ మేర‌కు పార్టీ ప్రధాన కార్యద‌ర్శి, ఎమ్మెల్సీ ప‌ల్లా రాజేశ్వర్ రెడ్డి, పార్టీ ఖ‌మ్మం వ్యవ‌హారాల ఇన్‌ఛార్జి నూక‌ల న‌రేష్ రెడ్డిలు.... వ‌న‌మా రాఘ‌వేంద్రను పార్టీ నుంచి సస్పెండ్ చేయాల‌ని నిర్ణయించారు. ఈ నిర్ణయం త‌క్షణం అమ‌లులోకి వ‌స్తుందని తెలిపారు.  


Also Read: పాల్వంచ కుటుంబం ఆత్మహత్య కేసులో మరో ట్విస్ట్... వనమా రాఘవను అరెస్టు చేయలేదని ఏఎస్పీ ప్రకటన


మరో బాధిత కుటుంబం ఆవేదన


కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు రాఘవేంద్రరావు వేధింపులు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. వనమా రాఘవ వేధింపులకు ఆరునెలల క్రితం పాల్వంచ పట్టణానికి చెందిన మలిపెద్ది వెంకటేశ్వర్లు అనే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన సూసైడ్ నోట్ లో రాఘవతో పాటు 42 మంది పేర్లు రాసినప్పటికీ ఈ కేసులో ఇప్పటి వరకు ఎలాంటి పురోగతి లేదు. వెంకటేశ్వర్లకు చెందిన భూమి విషయంలో వనమా రాఘవ రూ. 10 లక్షలు తీసుకొని, వేరే వారికి మద్దతు పలికాడని వెంకటేశ్వర్లు కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. దీంతో పాటు వేరే కేసులో ఇరికించి జైలుకు పంపడంతో వెంకటేశ్వర్లు ఆత్మహత్య చేసుకున్నాడని అంటున్నారు. ఈ కేసులో  పోలీసుల పైనా ఆరోపణలున్నాయి. ఆరు నెలల క్రితం జరిగిన ఈ ఆత్మహత్యపై జాప్యం చేశారని బాధితులు ఆవేదన చెందుతున్నారు. అప్పుడే సరైన శిక్ష వేస్తే రామకృష్ణ కుటుంబం బతికి ఉండేదని, ఇప్పటికైనా ప్రభుత్వం రాఘవపై చర్యలు తీసుకొని తమ లాంటి వారికి న్యాయం చేయాలని కోరుతున్నారు. 


Also Read: కొత్తగూడెం ఫ్యామిలీ సూసైడ్‌ కేసులో మరో ట్విస్టు.. తన భార్యను ఎమ్మెల్యే కుమారుడు రమ్మన్నాడని నాగ రామకృష్ణ సెల్ఫీ వీడియో


పోలీసుల అదుపులో నలుగురు..!


తెలుగు రాష్ట్రాల‌్లో సంచలనం సృష్టించిన రామకృష్ణ కుటుంబ ఆత్మహత్య కేసులో పురోగతి సాధించినట్టు తెలుస్తోంది. కొత్తగూడెం నియోజకవర్గానికి చెందిన నలుగురిని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. అనేక సెటిల్‌మెంట్‌లలో రాఘవతో  భాగస్వాములయ్యారని, రామకృష్ణ పంచాయతీ జరిగినప్పుడు కూడా ఈ నలుగురు ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. అందుకే వీరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. కొత్తగూడెం నియోజకవర్గంలో రాజకీయంగా పలుకుబడి ఉన్న ఈ నలుగురు వ్యక్తులపై ఇప్పటికే అనేక అభియోగాలున్నాయి. అయితే రామకృష్ణ ఆత్మహత్యకు ముందు 15 పేజీల సూసైడ్‌ నోట్‌ రాసినట్లు ప్రచారం జరుగుతుంది. పంచాయతీ జరిగిన సందర్భంలో ఎవరెవరు ఉన్నారనే విషయాన్ని అందులో స్పష్టంగా పేర్కొనడంతో పోలీసులు ఆ దిశగా కేసు దర్యాప్తు వేగవంతం చేసినట్లు సమాచారం.


Also Read: రామకృష్ణ కేసులో పురోగతి.. పోలీసుల అదుపులో నలుగురు..? రహస్య ప్రదేశంలో విచారణ!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి