ఏపీలో రాజకీయ పార్టీల మధ్య పొత్తులపై టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కౌంటర్ ఇచ్చారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు కామెంట్స్‌ను ఎద్దేవా చేస్తూ మాట్లాడారు. ‘‘చంద్రబాబు ఎవరినైనా లవ్ చేస్తాడు.. వదిలేస్తాడు.. ఆయన అవకాశ వాది. ఎవరినైనా ఏ సందర్భంలోనైనా లవ్ చేస్తాడు. తర్వాత ఆయన పాత్ర ఏంటో చూపిస్తాడు. ఇప్పుడు పవన్ కల్యాణ్ కోసం ప్రయత్నం చేస్తున్నారు.’’ అని సోము వీర్రాజు మాట్లాడారు.
‘‘1996లో కాంగ్రెస్ పార్టీతో జత కట్టి చక్రం తిప్పిన మాహా చక్రవర్తి. అవకాశం వచ్చినప్పుడు పార్టీలతో జత కట్టి తర్వాత ఆయన తత్వం ఏంటో చూపిస్తారు. గతంలో మామ దగ్గర్నుంచీ భారతీయ జనతా పార్టీ వరకూ పొత్తు పెట్టుకొని ఆయన అంటే ఏంటో మీరు చూశారు. ఇప్పుడు పవన్ కల్యాణ్ గురించి ప్రయత్నిస్తున్నారు. ఏ సందర్భంలోనైనా లవ్ చేయగల సామర్థ్యం చంద్రబాబుకు ఉంది.’’ అని సోము వీర్రాజు మాట్లాడారు.
Also Read: Crime News: మంటల్లో కాలిపోతున్న భర్త.. చోద్యం చూస్తూ నుంచున్న భార్య, కొడుకు.. అసలేం జరిగిందంటే..
నిన్న (జనవరి 6) చంద్రబాబు కుప్పం పర్యటన సందర్భంగా జనసేనతో పొత్తు గురించి మాట్లాడిన సంగతి తెలిసిందే. ‘వచ్చే ఎన్నికల్లో పవన్ కల్యాణ్‌తో పొత్తు పెట్టుకోవాలని కార్యకర్తలు కోరారు. ఈ సందర్భంగా.. లవ్ వన్ సైడ్ కాదు.. రెండు వైపులా ఉండాల’ని వ్యాఖ్యానించారు. ఏకపక్ష లవ్ సరికాదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను మాట్లాడిన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారంటూ చంద్రబాబు నేడు (డిసెంబరు 7) స్పష్టత ఇచ్చారు. అవసరమైతే రాష్ట్ర ప్రయోజనాల కోసం పొత్తులు ఉంటాయని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం అప్పటి పరిస్థితులను బట్టి పొత్తులు పుట్టుకొస్తాయి తప్ప.. సాధారణ పరిస్థితుల్లో రావు. అంతేకానీ, పొత్తుల వల్లే గెలుస్తామనే వైఎస్ఆర్ సీపీ నేతల మాటలు సరికాదని కొట్టిపారేశారు. వారికి ఏమీ తెలీదని, కొత్త బిచ్చగాళ్లంటూ ఎద్దేవా చేశారు. ‘‘ఒక్క ఛాన్స్ అన్నారు.. మీకిచ్చిన అవకాశం అయిపోయింది. భవిష్యత్తులో మిమ్మల్ని తరిమికొట్టే పరిస్థితి వస్తుంది.’’ అని చంద్రబాబు మాట్లాడారు.
Also Read: Srikakulam: సచివాలయాల్లో చేపల విక్రయాలు... మినీ ఫిష్ రిటైల్ అవుట్ లెట్ల ఏర్పాటుకు ఆదేశాలు...